చిన్నారితో స్నేహం చేస్తోన్న మైనా... ఏకంగా స్కూల్ కి వెళ్ళిపోతోంది!

ఈ అరుదైన ఘటన పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.వెస్ట్ బర్ధమాన్‌( West Bardhaman)లోని కాంక్సాలోని శివపూర్ ప్రాథమిక పాఠశాలలో అంకిత( Ankita ) అనే చిన్నారి చదువుతోంది.

 Maina, Who Is Making Friends With The Child Is Going To School Together ,girl, M-TeluguStop.com

అంకిత స్కూల్ కి వచ్చిన ప్రతిసారీ మిథు అనే ఒక ఇండియన్ మైనా ఫాలో అవుతూ వస్తూ ఉంటుంది.అంకిత క్లాస్‌రూమ్‌లో ఉన్నంత సేపూ ఆ మైనా అక్కడే ఉంటుంది.

అంకిత మిథు( Mithu ) నోటిలో ఆహారం పెడుతూనే ఉంటుంది.అంకిత ఇంటికి వెళ్ళగానే, మిథూ కూడా తన ఇంటికి తిరిగి పయనమౌతుంది.

శివపూర్ ప్రాథమిక పాఠశాలకు ప్రతిరోజూ అనేక మంది చిన్న బాల బాలికలు వస్తుంటారు.కానీ ఆ మైనా అంకితను మాత్రమే ఫాలో అవుతూ వస్తుంది.

ఈ ఏడాది శివపూర్ ప్రాథమిక పాఠశాలలో అంకిత చేరింది. అంకిత స్కూల్‌లో చేరిన రోజు నుంచి మైనా కూడా ఆమెతో పాటు స్కూల్‌కి వెళ్లడం గమనార్హం.

వారి ఇద్దరి బంధానికి స్థానికులతో పాటు స్కూలు యాజమాన్యం కూడా విస్తు పోతున్నారు.అంకిత స్కూల్ కి రాగానే మిథూ చెట్టు మీద నుండి ఎగిరి అంకిత భుజం మీద లేదా తల మీద వచ్చి కూర్చుంది.

ఓ పక్షితో చిన్నారికి కుదిరిన స్నేహం ఇప్పుడు సోషల్ మీడియాలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారడం విశేషం.అంకిత ప్రేమగా మిథుకి బిస్కెట్ ముక్కలు తినిపిస్తూ ఉంటుంది.

అంకితను చూసి మిగతా స్టూడెంట్స్ .స్కూల్ టీచర్లు కూడా మిథు నోటికి ఆహారం అందిస్తూ ఉంటారు.

Telugu Ankita, Friendship, School, Latest-Latest News - Telugu

చిన్నారి పట్ల పక్షి చూపిస్తున్న ఈ ప్రేమను చూసి శివపూర్ ప్రాంత ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.మైనా తనని కలవని రోజు అంకిత చాలా బాధపడుతుందట.ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏమంటే, అంకిత స్కూల్‌కు రాని రోజు.మైనా కూడా రాదు.ఇక కొన్ని కొన్నిసార్లు మైనా ఆ చిన్నారితో కలిసి ఇంటికి కూడా వెళ్తుంది.ఓ రకంగా చెప్పాలంటే మైనా ఇపుడు అంకిత ఇంట్లో ముఖ్యమైన సభ్యురాలు అయిపోయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube