డ్రైవర్ లెస్ సోలార్ పవర్ బస్.. యూనివర్సిటీ విద్యార్థుల మేధాశక్తి అద్భుతం..!

టెక్నాలజీ పరంగా అన్ని రంగాలు అభివృద్ధి చెందుతూ కొత్త కొత్త ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి.ఇక ఎలక్ట్రానిక్, వాహన రంగాల్లో ప్రతిరోజు ఏదో ఒక కొత్త టెక్నాలజీ గురించి వింటూనే ఉన్నాం.

 Driverless Solar Power Bus The Brain Power Of University Students Is Amazing , J-TeluguStop.com

అయితే పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థుల మేధాశక్తి అద్భుతం.ఓ సరికొత్త ఆలోచనతో డ్రైవర్ లేకుండా నడిచే సోలార్ బస్సును రూపొందించారు.

బస్సులో డ్రైవర్ లేకుండా కేవలం సోలార్ తో నడిచే బస్సు వల్ల పర్యావరణంలో ఎటువంటి కాలుష్యం ఉండదు.భారతదేశంలో డ్రైవర్ లేకుండా సౌర శక్తితో నడిచే బస్సును రూపొందించిన ఘనత పంజాబ్ లోని జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ విద్యార్థులకు దక్కుతుంది.

వాహన కమ్యూనికేషన్స్ ద్వారా డ్రైవర్ లేకుండానే సౌర శక్తితో బస్సు ప్రయాణిస్తుంది.సౌర శక్తితో పాటు ఎలక్ట్రిక్ మోటార్ రూపంలో పునరుత్పాదక శక్తి ఉంటుంది.గంటకు 30 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు కూర్చునేందుకు వీలుగా ఉంటుంది.ఈ డ్రైవర్ లెస్ బస్సు ప్రత్యేకతలు, సామర్థ్యాలు చూసి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

సరికొత్త ఆలోచనతో ఎల్ పి యు స్టూడెంట్స్ ఆవిష్కరణకు సాక్ష్యంగా నిలిచిన ఈ డ్రైవర్ లెస్ బస్ నిజంగా ఓ అద్భుతమనే చెప్పాలి.మన భారత విద్యార్థుల మేధాశక్తిని మెచ్చుకోక ఉండలేము.అయితే 2019లో అప్పటి కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మేధాశక్తి ఆలోచన విధానాన్ని మెచ్చుకొని ప్రోత్సహించారు.2019లోని ఈ డ్రైవర్ లెస్ సోలార్ బస్సు రూపొందించడానికి విద్యార్థులు ప్రారంభించారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థుల మేధాశక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే ఇలాంటి అద్భుతాలు ఎన్నో కళ్ళ ముందుకు వస్తాయని విద్యార్థులు కోరుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube