ఆమధ్య సోషల్ మీడియాలో విధుల్లో తిరుగుతూ, వేరుశెనగలు అమ్మేటువంటి ‘భుబన్ బద్యాకర్’ పాడిన కచ్చా బాదం పాట ఎంత పాపులర్ అయిందో మీకు తెలియంది కాదు.ఇప్పుడు అదే స్టైల్ నమ్ముకొని ఓ కుల్ఫీని అమ్మే వ్యక్తి ఓ సాంగ్ ను పాడుతూ.
ప్రజల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయగా ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.దాంతో ఇప్పుడు ఈ వీడియో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
ప్రజల దృష్టిని తన కుల్ఫీ బండివైపు తిప్పుకునేందుకు పాట పాడుతూ కుల్ఫీని అమ్మకం చేపడుతున్నాడు.కాగా ఆకర్షించే వాయిస్ అతని సొంతం అవడంతో అతని శైలిని ప్రజలు ఇపుడు ఇష్టపడుతున్నారు.
కుల్ఫీలు కొనడం దేవుడికెరుక గాని, అతని పాటను వినడానికి మాత్రం జనాలు అతని బండి దగ్గరకు తరలి వెళ్తున్నారు.కాగా ఈ వ్యక్తి చూడడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ని పోలి ఉండడం కొసమెరుపు.దాంతో నెటిజన్లు రకరకాల కామెంట్లతో మనోడిని మోసేస్తున్నారు.‘మీ గాత్రంతో మా హృదయాన్ని గెలుచుకున్నావు చాచా!’ ఒకరంటే ‘బాబాయ్ జాగ్రత్త! కుల్ఫీలు మాట అటుంచి ఆంటీలు మీకు లైన్ వేయగలరు’ అని సరదాగా కామెంట్ చేస్తున్నారు.
ట్విట్టర్ అకౌంట్ @yunusrj హ్యాండిల్‌కు చెందిన యూనస్ ఖాన్ ఈ కుల్ఫీ చాచా వీడియో షేర్ చేయగా అది కాస్త ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.వ్యాపారం చేయడానికి చాచా వాడుతున్న ట్రిక్ చాలా బావుందని నెటిజన్లు కితాబిస్తున్నారు.కాగా ఈ 23 సెకన్ల క్లిప్ ఇప్పటివరకు 63,000 కంటే ఎక్కువ మంది చూస్తున్నారు.కొంతమంది ఇతగాడు గానం వల్ల కాదు గాని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పోలిక కారణంగా బయటకి రావచ్చు అని అభిప్రాయపడుతున్నారు.
ఒకరైతే డొనాల్డ్ ట్రంప్ మామ.మీరు ఎప్పుడు కుల్ఫీ అమ్మడం ప్రారంభించారు అంటూ కామెంట్ చేయడం కొసమెరుపు.