మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారి పోయాడు.కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా రామ్ చరణ్ కి అవకాశాలు వస్తున్నాయి అనడంలో సందేహం లేదు.
రామ్ చరణ్ భవిష్యత్తులో హిందీ లో వరుసగా సినిమాలు చేసే అవకాశాలు చాలానే ఉన్నాయని మెగా కాంపౌండ్ కి చెందిన వారు మాట్లాడుకుంటున్నారు.అంతకంటే ముందు రామ్ చరణ్ ఒకే సారి రెండు హిందీ సినిమాల్లో నటిస్తున్నాడు.
అది కూడా బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్ మరియు షారుక్ ఖాన్ ల యొక్క సినిమాల్లో కనిపించబోతున్నాడు.సల్మాన్ ఖాన్ నటిస్తున్న కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సినిమా లో చరణ్ ఒక పాట లో కనిపించబోతున్నాడు.
సల్మాన్ ఖాన్ మరియు వెంకటేష్ లతో కలిసి ఆ పాటలో రామ్ చరణ్ స్టెప్స్ వేశాడు.ఈ విషయాన్ని స్వయంగా సల్మాన్ ఖాన్ గతంలో ఒక సందర్భంగా తెలియజేసిన విషయం తెలిసిందే.
తాజాగా షారుక్ ఖాన్ హీరో గా నటిస్తున్న జవాన్ సినిమా లో కూడా రామ్ చరణ్ గెస్ట్ రోల్ పోషించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది.నిన్న మొన్నటి వరకు అల్లు అర్జున్ ఆ పాత్ర ను చేయబోతున్నాడని అంతా అనుకున్నారు.కానీ రామ్ చరణ్ ఆ పాత్ర చేయనున్నట్లుగా కొత్త ప్రచారం మొదలైంది.రామ్ చరణ్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ నేపథ్యం లో జవాన్ సినిమా లో ఆయన్ని నటింపజేయాలని షారుక్ ఖాన్ భావించి ఉంటాడు అనేది మెగా వర్గాల టాక్.
ఇక రామ్ చరణ్ తెలుగు సినిమాల విషయానికి వస్తే శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా ను చేస్తున్న విషయం తెలిసిందే.ఆ సినిమా పూర్తి కాకుండానే బుచ్చి బాబు దర్శకత్వంలో కూడా రామ్ చరణ్ కొత్త సినిమా ను మొదలు పెట్టాల్సి ఉంది.
ప్రస్తుతం ఆస్కార్ అవార్డు వేడుక కోసం అమెరికాలో చక్కర్లు కొడుతున్న రామ్ చరణ్ వచ్చే సంవత్సరం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే అవకాశాలు ఉన్నాయి.