నందమూరి కుటుంబంలో తారకరత్న మరణం తర్వాత చాలా విషయాలు బయట ప్రపంచానికి అర్థమయ్యాయి.కుటుంబం అన్నాక గొడవలు సహజమే కానీ మొండిగా ప్రవర్తించడమే మూర్ఖత్వానికి నిదర్శనంగా కనిపిస్తుంది.
తారక రత్న లాంటి ఒక చెట్టంత కొడుకు చనిపోతే ఆ తండ్రి హృదయం పాషానంలా మారిందే తప్ప అతడి పిల్లలపై కనీసం చెయ్యి వేసి నేనున్నాను అని చెప్పే ధైర్యం చేయలేక పోయింది.నిజంగా ఇలాంటి ఒక కర్కశ మనసు ఎవరికైనా ఉంటుందా? కన్నీరు పెడుతున్న కోడలి పట్ల జాలి లేదు, ఏడుస్తున్న పిల్లల పట్ల ఆదరణ లేదు.కేవలం రాజకీయ కారణాల వల్లే దూరంగా ఉన్నారా అంటే అది కూడా పూర్తి వాస్తవం కాకపోవచ్చు.ప్రస్తుతం నందమూరి తారక రత్న విషయం మాత్రమే బయట ప్రపంచానికి అర్థం అయింది కానీ అర్దం కావలసిన విషయాలు ఇలాంటివి అనేకం ఉన్నాయి.

నందమూరి కుటుంబంలో ఉన్న చీకటి వాస్తవాలలో త్రివిక్రమ రావు ఉదాహరణ కూడా ఒకటి.అన్న తమ్ముల అనుబంధం అనే సినిమా తీసేంత గొప్ప చరిత్ర ఉన్న ఎన్టీఆర్, త్రివిక్రమ రావు ఎందుకు విడిపోయారు అన్న విషయమే చాలామందికి తెలియదు.తెర వెనక అసలు ఏం జరిగింది అనే విషయాన్ని ఎవరు చెప్పరు కూడా.త్రివిక్రమ రావు తన కొడుకులను ఇండస్ట్రీకి పరిచయం చేసే సమయంలో కూడా ఎన్టీఆర్ సపోర్ట్ చేయలేదు అనే కొంతమంది అంటూ ఉంటారు.
ఇక త్రివిక్రమ రావు కొడుకు చక్రవర్తి ఉన్నపళంగా ఇండస్ట్రీని వదిలి ఎందుకు వెళ్లారో కూడా చాలా మందికి తెలియదు.ఈ విషయం కూడా ఎప్పుడు నందమూరి కుటుంబం మాట్లాడలేదు.

హీరో నవీన్ వడ్డే వ్యవహారం కూడా ఇంచు మించు ఇలాంటిదే.నందమూరి కుటుంబంలోని ఒక అమ్మాయిని ప్రేమించిన పాపానికి అతడికి భవిష్యత్తు లేకుండా చేశారు అని చాలామంది అంటుంటారు.అందులో నిజమెంత ఉన్నా కూడా నవీన్ వడ్డే మాత్రం దాదాపు కెరియర్ ను పోగొట్టుకున్నాడు.నందమూరి కుటుంబంలో ప్రేమ పెళ్లిళ్లు జరగడం ఇష్టం ఉండదు అని ఈ సంఘటన కూడా రుజువు చేస్తుంది తారక రత్న విషయంలో కూడా ప్రేమ పెళ్లి కారణంగానే గొడవలు అయ్యాయని విషయం మనందరికీ తెలిసిందే.