మాకు బాబు పుట్టాడు... కొడుకుకు జన్మనిచ్చిన హీరో నవీన్ చంద్ర భార్య... ఫోటో వైరల్!

తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలు వెబ్ సిరీస్లలో హీరోగా సహాయ నటుడు పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ చంద్ర గత కొద్దిరోజుల క్రితం తాను తండ్రి కాబోతున్నానంటూ తన భార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం మనకు తెలిసిందే.అయితే ఈయన భార్య తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.

 Hero Naveen Chandra S Wife Who Gave Birth To A Son Photo Viral, Hero Naveen Chan-TeluguStop.com

ఈ క్రమంలోనే నవీన్ చంద్ర తనకు కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా నవీన్ చంద్ర తన కుమారుడిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ … మాకు బాబు పుట్టాడు అంటూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఈయన కొడుకు పుట్టారనే విషయం చెప్పడంతో ఎంతోమంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ప్రస్తుతం నవీన్ చంద్ర షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది.

ఇకపోతే నటుడిగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈయన ఎవరికి తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తన వివాహం చేసుకున్నారు.అయితే వివాహమైన తర్వాత గత ఏడాది వాలెంటెన్స్ డే సందర్భంగా ఈయన తన భార్య ఓర్మాని పరిచయం చేశారు.అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య గర్భవతి అని త్వరలోనే తాను తండ్రి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఇక ప్రస్తుతం నవీన్ చంద్ర దంపతులకు కుమారుడు జన్మించడంతో ఈ శుభవార్తను కూడా అందరితో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube