మాకు బాబు పుట్టాడు… కొడుకుకు జన్మనిచ్చిన హీరో నవీన్ చంద్ర భార్య… ఫోటో వైరల్!
TeluguStop.com
తెలుగు తమిళ భాషలలో పలు సినిమాలు వెబ్ సిరీస్లలో హీరోగా సహాయ నటుడు పాత్రలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో నవీన్ చంద్ర గత కొద్దిరోజుల క్రితం తాను తండ్రి కాబోతున్నానంటూ తన భార్య బేబీ బంప్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే ఈయన భార్య తాజాగా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు.ఈ క్రమంలోనే నవీన్ చంద్ర తనకు కొడుకు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.
"""/"/
ఈ సందర్భంగా నవీన్ చంద్ర తన కుమారుడిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ .
మాకు బాబు పుట్టాడు అంటూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు.ఇలా ఈయన కొడుకు పుట్టారనే విషయం చెప్పడంతో ఎంతోమంది అభిమానులు ఇతర సెలబ్రిటీలు నవీన్ చంద్ర దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ప్రస్తుతం నవీన్ చంద్ర షేర్ చేసిన ఈ ఫోటో వైరల్ అవుతుంది. """/"/
ఇకపోతే నటుడిగా పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నటువంటి ఈయన ఎవరికి తెలియకుండా కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో తన వివాహం చేసుకున్నారు.
అయితే వివాహమైన తర్వాత గత ఏడాది వాలెంటెన్స్ డే సందర్భంగా ఈయన తన భార్య ఓర్మాని పరిచయం చేశారు.
అయితే ఈ ఏడాది వాలెంటైన్స్ డే సందర్భంగా తన భార్య గర్భవతి అని త్వరలోనే తాను తండ్రి కాబోతున్నాననే విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.
ఇక ప్రస్తుతం నవీన్ చంద్ర దంపతులకు కుమారుడు జన్మించడంతో ఈ శుభవార్తను కూడా అందరితో పంచుకున్నారు.
ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.
ప్రభాస్ సలార్ 2 సినిమాతో భారీ విజయాన్ని సాధిస్తాడా..?