యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేసిన సినిమాలు చాలా వరకు మంచి సక్సెస్ ని సాధించాయి వాళ్ల పెదనాన్న కృష్ణంరాజు పేరు ని నిలబెడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు.అలాంటి ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి లో సినిమాలు చేయడం నిజం గా గ్రేట్ అనే చెప్పాలి.
ఇక ప్రభాస్ విషయం అలా ఉంటే నందమూరి వంశం నుంచి వచ్చిన ఎన్టీయార్ సీనియర్ ఎన్టీయార్ కి ఏ మాత్రం తగ్గకుండా తనదైన రీతిలో నటిస్తూ విమర్శకుల ప్రశంశలు అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు.వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో యంగ్ హీరోలందరి గట్టి పోటీ ఇస్తున్నాడు.నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన చాలా మంది యంగ్ హీరోల్లో ఎన్టీయార్ ఒక్కడే మంచి పేరు సంపాదించుకున్నాడు…
ఇక అసలు విషయం ఏంటంటే ప్రభాస్, ఎన్టీయార్ ఇద్దరు నటించిన రెండు సినిమాలా కథలు ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి అవి ఏంటంటే ప్రభాస్ ది రెబల్ సినిమా కాగా ఎన్టీయార్ ది రామయ్య వస్తావయ్యా…ఈ రెండు సినిమాలు చాలా దగ్గర గ్యాప్ లో రిలీజ్ అయ్యాయి అయితే రెబల్ సినిమా కి ప్రముఖ కొరియోగ్రాఫర్ అయిన లారెన్స్ దర్శకత్వం వహించగా, ఎన్టీయార్ నటించిన రామయ్యా వస్తావయ్యా సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహించాడు ఈ రెండు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ చనిపోతే హీరో రౌడీల మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం ఇంకో హీరోయిన్ ని ప్రేమిస్తాడు ఈ రెండు సినిమాల్లో కూడా సెకండ్ హీరోయిన్ నాన్నలే విలన్స్ గా ఉండడం మనం గమనించవచ్చు…ఈ రెండు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్లు గా మిగిలాయి…