తెలంగాణ రాష్ట్రంలో వివిధ కోర్సులకు నిర్వహించే కామన్ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి.ఈ మేరకు షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది.
మే 7 నుంచి 11 వరకు ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్ష జరగనుంది.మే 12 నుంచి 14 వరకు అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.
అదేవిధంగా మే 18న ఎడ్ సెట్, మే 20న ఈ సెట్ తో పాటు మే 26, 27 తారీఖులలో ఐసెట్ ఎంట్రన్స్ టెస్ట్ జరగనుందని వెల్లడించారు.