మనం సాధారణంగా తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలు కచ్చితంగా ఉంటాయి.ప్రస్తుత రోజులలో వీటి వినియోగం ఎక్కువగా ఉందని ఖచ్చితంగా చెప్పవచ్చు.
జొన్నలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
జొన్నల్లో క్యాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ వంటి వాటితో పాటు పీచు పదార్థాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
చాలామంది జొన్నలతో రొట్టెలను తయారు చేసుకొని తింటూ ఉంటారు.
కేవలం రొట్టెలే కాకుండా ఈ జొన్నలతో మనం కూడా తయారు చేసుకోవచ్చు.జొన్న అంబలిని తాగడం వల్ల రుచితో పాటు చక్కని ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది.
జొన్న అంబలిని తయారు చేసుకోవడం ఎంతో తేలిక ఈ అంబలిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు.
ఇప్పుడు జొన్న అంబలిని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు జొన్న పిండిని తీసుకోవాలి.తర్వాత ఇందులో మూడు గ్లాసుల నీరు పోసి ఉండలు లేకుండా కలపాలి.
ఇందులోని సైంధవ లవణాన్ని వేసి బాగా కలపాలి తర్వాత ఈ గిన్నెను స్టవ్ మీద ఉంచి మద్యస్థ మంటపై కాసేపు అలాగే ఉంచాలి.ఈ అంబలిని ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు ఉడికించి తర్వాత స్టవ్ ఆఫ్ చెయ్యాలి.

ఒక గ్లాసులోకి తీసుకొని అందులో మిరియాల పొడి, నిమ్మరసం వేసి బాగా కలపాలి.ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే అంబలి తయారవుతుంది.ఈ విధంగా తయారుచేసిన జొన్న అంబలిని తాగడం వల్ల నీరసం, బలహీనత వంటి సమస్యలు దూరం అవుతాయి.ఎముకలు దృఢంగా మారుతాయి.రక్తహీనత సమస్య దూరం అవుతుంది.

అంతేకాకుండా అంబలిని తాగడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది.మలబద్ధకం, గ్యాస్ సమస్యలు కూడా దూరం అవుతాయి.బరువు తగ్గాలనుకునే వారు ఈ అంబలి తాగడం వల్ల ఎన్నో మంచి ప్రయోజనాలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలంటే గుండె, షుగర్ వ్యాధులు ఉన్నవారు జొన్న అంబలిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.