బాలీవుడ్ బాద్షా ఇప్పుడు నిజంగానే బాద్షా అనిపించు కుంటున్నాడు.ఎందుకంటే బాలీవుడ్ గత కొన్నాళ్లుగా హిట్ లేక సతమతం అవుతున్న నేపథ్యంలో పఠాన్ సినిమాతో షారుఖ్ ఖాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
బాలీవుడ్ ఘోరంగా విమర్శలు ఎదుర్కున్న క్రమంలో షారుఖ్ ఈ సినిమాతో ఊరట కలిగించాడు.పఠాన్ సినిమా జనవరి 25న రిపబ్లిక్ డే కానుకగా గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయ్యింది.
ఈ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని బాలీవుడ్ లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది.నాలుగేళ్ళ గ్యాప్ ఇచ్చి మరీ ఇప్పుడు ”పఠాన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు షారుఖ్.
బాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో భారీ కలెక్షన్స్ సైతం రాబడుతుంది.షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టిస్తుంది.వారం రోజుల్లోనే 700 కోట్ల రూపాయలను వసూళ్లు చేసి బాలీవుడ్ కు పూర్వవైభవం తీసుకు వచ్చింది.ఇక ఇప్పుడు వరల్డ్ వైడ్ గా పఠాన్ సినిమా ఎన్ని కోట్లను రాబట్టింది అనేది మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేసారు.
ఈ సినిమా ఈ రోజుతో వరల్డ్ వైడ్ గా రూ.832 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్టు పఠాన్ మేకర్స్ కొద్దిసేపటి క్రితం అఫిషియల్ గా పోస్టర్ ద్వారా తెలిపారు.ఒక్క ఇండియాలోనే ఈ సినిమా 500 కోట్ల మార్క్ ను దాటినట్టు తెలిపారు.రిలీజ్ అయ్యి ఇన్ని రోజులు గడుస్తున్నా ఇంకా కొన్ని చోట్ల పఠాన్ సినిమా కలెక్షన్స్ రాబడుతూనే ఉంది.
చూడాలి ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎన్ని కోట్లో.