టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్లలో సమంతా కూడా ఒకరు.
సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలోని సమంత నటించిన సినిమాల వరుసగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఒకవైపు సినిమాను పూర్తి చేస్తూనే మరోవైపు కొత్త కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.ఇది ఇలా ఉంటే సమంత ఇటీవల యశోద సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.
అయితే గత కొంతకాలంగా ఆమె మయోసైటీస్ అనే వ్యాధి భారిన పడటంతో ఇప్పుడిప్పుడే ఆ వ్యాధి నుంచి పూర్తిస్థాయిలో కోలుకొని మళ్ళి సినిమాలలో బిజీ బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తోంది.ఒకవైపు జిమ్లో వర్కౌట్లు చేస్తూనే మరోవైపు సినిమా షూటింగ్లలో పాల్గొంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు మరింత దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తోంది.
కాగా సమంత నటించిన శాకుంతలం సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే.
అలాగే సమంత ప్రస్తుతం సిటాడెల్ అనే ఒక వెబ్ సిరీస్ లో నటిస్తోంది.తాజాగా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.కొత్త ఏడాది జనవరిలో తన లైఫ్ ఎలా సాగిందో సోషల్ మీడియాలో ఫొటోల ద్వారా పంచుకుంది.
సిటాడెల్ చిత్రబృందంతో మీటింగ్, వర్కౌట్లు, ఫొటో షూట్‌లతో జనవరి నెల గడిచిపోయిందంటూ సామ్ పోస్ట్ చేసింది.సమంత తన పోస్ట్‌లో.గట్టిగా ఊపిరి పీల్చుకో పాప.
త్వరలో అన్నీ సర్దుకుంటాయని నేను నీకు మాటిస్తున్నా.గత 7,8 నెలలుగా చాలా ఇబ్బందులు పడుతూ ముందుకు సాగావు.ఆ క్లిష్ట పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నావో ఎప్పటికీ గుర్తుపెట్టుకో.
ఎన్ని ఇబ్బందులు ఎదురైన ధైర్యంగా అడుగేశావ్.ఈ విషయంలో నేను ఎంతో గర్వంగా ఉన్నా.
ధైర్యంగా మరింత ముందుకు సాగిపో అంటూ జనవరిలో జరిగిన విషయాలను ఓసారి గుర్తు చేసుకున్నారు సమంత.ప్రస్తుతం అవి కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.