మూడు పాత్రల్లో నటించినా పాపం ఆ హిట్‌ సినిమా హీరోను పట్టించుకోరేం?

నందమూరి కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసారా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.చాలా సంవత్సరాల తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ ఆ సినిమాతో సక్సెస్ ని దక్కించుకున్నాడు.

 Nandamuri Kalyan Ram Amigos Movie Not Getting Audience Support, Amigos Movie, B-TeluguStop.com

ఆ సక్సెస్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది మరో వారం రోజుల్లో క్లారిటీ రాబోతుంది.నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన అమిగోస్ సినిమా వచ్చే వారం ప్రేక్షకులు ముందుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది.

Telugu Amigos, Bimbisara, Kalyan Ram, Nandamurikalyan, Telugu-Movie

సినిమా కు సంబంధించిన పోస్టర్స్ మరియు టీజర్స్ సినిమా పై ఫ్యాన్స్ లో అంచనాలు పెంచాయి.అంతే కాకుండా సినిమాలో నందమూరి బాలకృష్ణ యొక్క సూపర్ హిట్ మెలోడీ ఎన్నో రాత్రులు వస్తాయి కానీ పాటను రీమిక్స్ చేయడం జరిగింది.దాంతో కూడా సినిమా కి మంచి పబ్లిసిటీ దక్కింది.ఇక ప్రధానంగా ఈ సినిమా లో నందమూరి కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.

ఈ మధ్య కాలం లో యంగ్ హీరోలు కనీసం డబల్ రోల్ పాత్రలను కూడా చేసేందుకు ధైర్యం చేయడం లేదు.అలాంటిది నందమూరి కళ్యాణ్ రామ్ ఏకంగా మూడు భిన్నమైన పాత్ర లో కనిపించబోతున్నాడు అనే విషయం నందమూరి అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కానీ ఈ విషయం ప్రేక్షకులను సినిమా వైపు ముగ్గు చూపే విధంగా ప్రేరేపించడం లేదు.

Telugu Amigos, Bimbisara, Kalyan Ram, Nandamurikalyan, Telugu-Movie

చిత్ర యూనిట్ సభ్యులు సినిమా లో నందమూరి కళ్యాణ్ రామ్ మూడు విభిన్నమైన పాత్ర లో కనిపించబోతున్నాడు అంటూ ప్రధానంగా పబ్లిసిటీ చేస్తే బాగుండేది.ఆ దిశగా పబ్లిసిటీ చేయడం లేదు.సినిమా లో కళ్యాణ్ రామ్ నట విశ్వరూపం చూపించాడని, చిత్ర యూనిట్ సభ్యులు చాలా నమ్మకంగా చెబుతున్నారు.

అదే విషయాన్ని ప్రేక్షకులకు నమ్మకం కలిగించే విధంగా ప్రమోషన్ కార్యక్రమాల ద్వారా చెప్పలేక పోతున్నారు.సినిమా విడుదలకు వారం రోజుల సమయం ఉంది అయినా ఇప్పటి వరకు సాధారణ జనాలకు అమిగోస్ సినిమా చేరువ కాలేదు.

టైటిల్ చూస్తేనే కాస్త విభిన్నంగా ఉంది.దాంతో ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.కనీసం సినిమా విడుదలైన తర్వాత అయినా పాజిటివ్ టాక్ దక్కించుకొని మౌత్ టాక్‌ తో జనాల్లోకి అమిగోస్‌ సినిమా వెళ్తుందేమో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube