తాజాగా టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్, అతియా శెట్టి ల వివాహం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే.ఈనెల 23వ తేదీన అతి కొద్దిమంది స్నేహితులు సన్నిహితులు, కుటుంబసభ్యులు, సెలబ్రిటీల మధ్యలో వివాహం ఘనంగా జరిగింది.
ప్రస్తుతం వీరికి సంబంధించిన ఫోటోలు వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.ఈ నేపథ్యంలోనే వీరి పెళ్లికి వచ్చిన ప్రముఖులు ఇచ్చిన గిఫ్ట్ లపై తాజాగా సోషల్ మీడియాలో వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
కాగా ఈ జంట పెళ్ళికి విరాట్ కోహ్లీ, సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్, ఎమ్‌ఎస్ ధోనీ వంటి ప్రముఖులు కోట్ల రూపాయల ఖరీదైన బహుమతులు ఇచ్చినట్టు తెలుస్తోంది.

అయితే విరాట్ కోహ్లీ రాహుల్, అతియాలకు పెళ్లి కానుకగా ఏకంగా 2.17 కోట్ల రూపాయల విలువైన బీఎమ్‌డబ్ల్యూ కారు గిఫ్ట్‌గా ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అలాగే ధోనీ కూడా 80 లక్షల రూపాయలన విలువైన కవాసకి నింజా బైక్‌ను బహుమతిగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఇకపోతే అతియా శెట్టి బాలీవుడ్ ప్రముఖ నటుడు సునీల్ శెట్టి ముద్దుల కూతురు అన్న విషయం మనందరికీ తెలిసిందే.

అయితే తన ముద్దుల కూతురు పెళ్లి కానుకగా సునీల్ శెట్టి ముంబైలో 50 కోట్ల రూపాయలు విలువ చేసే విలాసవంతమైన బంగ్లాను కానుకగా ఇచ్చినట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.ఇక సునీల్ శెట్టి సహనటులైన సల్మాన్ ఖాన్, జాకీ ష్రాఫ్‌లు సైతం ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు సమాచారం.

సల్మాన్ ఖాన్ 1.64 కోట్ల రూపాయల విలువైన ఆడీ కారును అతియాకు గిఫ్ట్‌గా ఇవ్వగా, జాకీ ష్రాఫ్ 30 లక్షల రూపాయల విలువైన చోపర్డ్ కంపెనీకి చెందిన లగ్జరీ వాచ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.అలాగే అర్జున్ కపూర్ 1.5 కోట్ల విలువైన డైమండ్ బ్రేస్‌లెట్‌ను నూతన దంపతులకు బహుమతులుగా సమర్పించినట్లు తెలుస్తోంది.అలా మొత్తంగా ఈ జంటకు కోట్ల రూపాయలు విలువ చేసే బహుమతులు వచ్చినట్టుగా తెలుస్తోంది.
వీటితో పాటుగా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ సన్నిహితులు అందరూ కలిసి మరిన్ని బహుమతులు ఇచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి.కాగా అతియా, రాహుల్‌లు ఇండస్ట్రీలోని ఫ్రెండ్స్ కోసం ముంబయిలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించనున్నారు.
ఆ రిసెప్షన్ ఎప్పుడు ఉండనుంది అన్న విషయాన్ని సునీల్ శెట్టి త్వరలోనే మీడియాకు వెల్లడిస్తాం అని తెలిపారు.