నాలుగేళ్ల తర్వాత దుబాయ్ నుంచి భారత్‌కి, అత్తింటివారిపై ఎన్ఆర్ఐ దాడి.. మామ, మరో బంధువు మృతి

పంజాబ్‌లో దారుణం చోటు చేసుకుంది.ఓ ఎన్ఆర్ఐ తన మామను, మరో వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు.

 Nri Kills Father-in-law, Wife's Cousin In Punjab, Punjab, Nri Kills, Tarsem Sin-TeluguStop.com

ఈ ఘటనలో మరో ముగ్గురు సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు.అనుమానితుడిని బల్వీందర్ సింగ్‌గా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.ఇతను రమణదీప్ కౌర్‌ను రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు.

అయితే పెళ్లయిన నాలుగు నెలలకే అతను దుబాయ్‌కి వెళ్లాడు.జరిగిన దారుణంపై రమణదీప్ కన్నీటి పర్యంతమయ్యారు.

తనకు ఇద్దరు కుమారులు వున్నారని, తన భర్త కట్నం కోసమే తనను విడిచిపెట్టి వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.పెళ్లయిన తర్వాత అతను ఈరోజే దుబాయ్ నుంచి తిరిగి వచ్చి తన కుటుంబంపై దాడి చేశాడని రమణదీప్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

మృతులను టార్సేమ్ సింగ్ (55), నరీందర్ సింగ్ (32)గా గుర్తించారు.గాయపడిన వారిని రచ్‌పాల్ కౌర్, రవీందర్ సింగ్, గుర్పాల్ సింగ్ .ఘటన తర్వాత నిందితుడు బల్వీందర్ సింగ్ అక్కడి నుంచి పారిపోయాడు.దీనిపై మలౌట్ డీఎస్పీ బాల్కర్ సింగ్ మాట్లాడుతూ.

ఈ ఘటనలకు సంబంధించి హత్య కేసు నమోదు చేశామని, బల్వీందర్‌ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

Telugu Gurpal Singh, Indiancommunity, Externalaffairs, Narinder Singh, Rachpal K

కాగా.గడిచిన ఐదేళ్లలో 2300 మందికి పైగా ప్రవాస భారతీయ మహిళల్ని వారి భర్తలు విడిచిపెట్టేశారని భారత ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ.మురళీధరన్ సమాధానం చెప్పారు.ప్రభుత్వం వద్ద వున్న డేటా ప్రకారం.

తమ భర్తలు తమను విడిచిపెట్టేశారంటూ 2372 మంది ఫిర్యాదులు చేశారని తెలిపారు.ఇవన్నీ గడిచిన ఐదేళ్ల కాలానికి సంబంధించినవేనని మురళీధరన్ వెల్లడించారు.

Telugu Gurpal Singh, Indiancommunity, Externalaffairs, Narinder Singh, Rachpal K

వివాహమైన ఎన్ఆర్ఐ మహిళలు ఎదుర్కొంటున్న గృహహింస, వేధింపులు ఇతర వివాదాల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మురళీధరన్ వెల్లడించారు.పలు దేశాల్లో వున్న భారతీయ మిషన్‌లు వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు వాక్ ఇన్ సెషన్‌లు, బహిరంగ సమావేశాలను నిర్వహిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.అలాగే అత్యవసర సాయం కోసం 24×7 హెల్ప్‌లైన్‌లను కూడా నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు.ఆపదలో వున్న ఎన్ఆర్ఐ మహిళలకు ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్ (ఐసీడబ్ల్యూఎఫ్) కింద ఆర్ధిక, న్యాయ సహాయం కూడా అందజేస్తున్నట్లు మురళీధరన్ పేర్కొన్నారు.

భారతీయ మిషన్లే కాకుండా మహిళా సంఘాలు, ఎన్జీవోలు, ఎన్ఆర్ఐ సంఘాలు కూడా బాధిత మహిళలకు సహాయం చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా వున్నాయన్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube