స్టేజ్ పైనే హీరోయిన్ పై అలాంటి కామెంట్స్ చేసిన అఖిల్.. సిగ్గుపడేలా చేశారంటూ?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ హీరో మన్మధుడు అక్కినేని నాగార్జున అమల ముద్దుల కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

 Anandhi Confess Her Crush Is Akhil Akkineni In Dance India Dance Grand Finale ,a-TeluguStop.com

అఖిల్ నటించినది తక్కువ సినిమాలే అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు.కానీ తన అన్న తండ్రి లాగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు అఖిల్.

కాగా అఖిల్ తండ్రి నాగార్జున ఎన్నో సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన మెప్పించిన విషయం తెలిసిందే.

అలాగే నాగచైతన్య సైతం వరుసగా సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు.కాగా అఖిల్ తెలుగులో హలో,అఖిల్, మిస్టర్ మజ్ను లాంటి సినిమాలు నటించగా మూడు సినిమాలు కూడా వరుసగా ఫ్లాప్ గా నిలిచాయి.ఇక ఆ తర్వాత 2021 లో వచ్చిన ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు.

ఇకపోతే అఖిల్ ప్రస్తుతం ఏజెంట్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతోంది.ఈ సినిమాపై అక్కినేని అఖిల్ తో పాటు అక్కినేని అభిమానులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అఖిల్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

ఇది ఇలా ఉంటే తాజాగా అఖిల్ డాన్స్ ఇండియా డాన్స్ అనే రియాల్టీ షో కి స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యాడు.ఇక అఖిల్ కి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పి స్టేజ్ పైకి వచ్చిన అఖిల్ తరువాత.

నేను మీ ఏజెంట్ సినిమా ట్రైలర్ చూశాను అందులో మీ స్వాగ్ అదిరిపోయింది అని బాబా మాస్టర్ అనగా అప్పుడు అఖిల్ అదే స్వాగ్ తో నడిచాడు.ఆ తర్వాత యంగ్ హీరోయిన్ ఆనంది అఖిల్ గారిని చూస్తుంటే ఎందుకింత త్వరగా పెళ్లి చేసుకున్నాను అని అనిపిస్తోంది అని అనడంతో వెంటనే అఖిల్ మీరు నేను సిగ్గుపడేలా చేశారు అని సమాధానం ఇవ్వడంతో అక్కడున్న వారందరూ నవ్వుకున్నారు.

ఆ తర్వాత రోహిణి అక్కడికి వచ్చి కామెడీ చేయడంతో అందరూ పక్కపక్క నవ్వుకున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube