సింగపూర్ వెండితెరపై మొదటి తెలుగు లఘు చిత్రం విడుదల..

శబ్ద కాన్సెప్ట్స్ బ్యానర్ పై నిర్మించిన లఘు చిత్రం సిరిజోత జనవరి 12వ తేదీన రాత్రి సింగపూర్ వింగ్స్ సినీమాటిక్స్ లో విడుదల చేశారు.ఈ చిత్రానికి కధ, మాటలు సుబ్బు పాలకుర్తి, కవిత కుందుర్తి అందించడం జరిగింది.

 Telugu Short Film Sirijotha Launched In Singapore Details, Telugu Short Film ,si-TeluguStop.com

సురేష్ రాజ్ దర్శకత్వం లో అభిరామ్, విజయ భారత్ పర్యవేక్షణ లో రూపు దిద్దుకున్న ఈ చిత్రం యూట్యూబ్ మద్యమం ద్వారా లాంచ్ అయినట్లు సమాచారం.

తెలుగు భాషా ప్రాముఖ్యత ను వివరిస్తూ తెలుగు ఆద్యంతం తెలుగు కోసం పాటుపడే పాత్రల సంఘర్షణలతో రూపొందించిన ఈ లఘు చిత్రాన్ని సింగపూర్ నందు నివసిస్తున్న తెలుగు ప్రముఖులు అభినందించారు.

తెలుగు భాష అభిమానులందరూ తప్పక చూడవలసిన చిత్రం అని వెల్లడించారు.

శ్రీ సాంస్కృతిక కళా సారధి అధ్యక్షులు శ్రీ రత్న కుమార్ కావుటూరు, కాకతీయ సాంస్కృతిక పరివారం అధ్యక్షులు శ్రీ రాంబాబు పాతూరి, సింగపూర్ తెలుగు సమాజం పూర్వాధ్యక్షులు శ్రీ రంగా రవి, సింగపూర్ పోతన భాగవత ప్రచార సమితి అధ్యక్షులు శ్రీ భాస్కర్ ఊలపల్లి, తాస్ అధ్యక్షుడు శ్రీమతి అనితా రెడ్డి, అమ్ములు గ్రూప్ సభ్యులు శ్రీమతి సునీత తదితర ప్రముఖు లందరూ వచ్చి తమ చిత్రాన్ని చూసి అభి నందించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని వెల్లడించారు.

అంతే కాకుండా సింగపూర్ వెండి తెర మీద ప్రదర్శించిన తొలి తెలుగు లఘు చిత్రం మాదే కావడం గర్వకారణం అని వెల్లడించారు.అందులోనూ తెలుగు భాష మీద నిర్మించిన చిత్రం కావడం మరింత ఆనందదాయకమని నిర్మాత సుబ్బు పాలకుర్తి సంతోషం వ్యక్తం చేశారు.మన తెలుగు ప్రజలు ఏ దేశంలో ఉన్న తెలుగు భాష కోసం కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube