సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం నెక్స్ట్ సినిమా కోసం రెడీ అవుతున్నాడు.సర్కారు వారి పాట ఘన విజయం తర్వాత మహేష్ బాబు చాలా గ్యాప్ తీసుకుని త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ చేసాడు.
త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఇప్పటికే సెట్స్ మీదకు వెళ్ళింది.వీరిద్దరి కాంబోలో సినిమా వచ్చి దశాబ్దానికి పైగానే అవుతుంది.
అందుకే మహేష్ ఫ్యాన్స్ ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తి చేస్తారా అని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.
హారిక హాసిని బ్యానర్ పై రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామని ప్రకటించారు.ఇక ఈ సినిమా లో మహేష్ కు జోడీగా బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నట్టు ఎప్పుడో ప్రకటించారు.
అయితే ఈ మధ్య కాలంలో ఈ సినిమాలో మరో హీరోయిన్ ఉందని పలు హీరోయిన్ల పేర్లు వినిపించాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ ను తాజాగా నిర్మాత నాగవంశీ ఇచ్చారు.ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ అనే విషయాన్ని కన్ఫర్మ్ చేసేసాడు.ఈ సినిమాలో పూజా హెగ్డేతో పాటు మరో హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు.
అలాగే ఈ సినిమాలో ఒకరు ఫస్ట్ మరొకరు సెకండ్ అనే అప్షన్ ఏమీ లేదని ఇద్దరు హీరోయిన్స్ కు కూడా ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుంది అని తెలిపారు.
దీంతో ఫైనల్ గా ఈ ఇద్దరు హీరోయిన్స్ అయితే ఫిక్స్ అయ్యారు.ఇంకా ఈ సినిమా షూట్ ఈ నెల 18 నుండి స్టార్ట్ అవుతుంది అని అలాగే ఆగష్టు 11న రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ చేసారు.ఇక సంక్రాంతి కానుకగా ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అని పోస్టర్ తో క్లారిటీ ఇచ్చారు.
ఇక ఈ సినిమాలో విలన్ రోల్ లో బాలీవుడ్ స్టార్స్ ను రంగంలోకి దించనున్నారట.చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో.