అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు జాన్వీ కపూర్ తెలుగు లో ఎంట్రీ ఇవ్వబోతుంది.బాలీవుడ్ లో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయ్యింది.
కానీ ఇప్పటి వరకు అక్కడ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేక పోయింది.అయినా కూడా ఇన్నాళ్లు అక్కడే సినిమా లు చేయాలని జాన్వీ కపూర్ భావించింది.
ఎట్టకేలకు ఆమె తీరు లో మార్పు వచ్చింది.వరుసగా సినిమాలు చేయాలి అనుకున్న జాన్వీ కపూర్ కు అక్కడ ఆశించిన స్థాయిలో సినిమా ల్లో ఆఫర్లు రావడం లేదు.
దాంతో సౌత్ సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు జాన్వీ కపూర్ కు కోటి రూపాయలకు పైగా పారితోషికం ఇచ్చేందుకు కూడా నిర్మాతలు సిద్ధం అయ్యారు.
కానీ ఇప్పుడు తెలుగు లో ఆమె నటించబోతున్న సినిమాకు కోటి లోపు పారితోషికం అందుకుంటుందనే వార్తలు వస్తున్నాయి.బాలీవుడ్ లో వరుసగా ఫ్లాప్ లు పడటంతో తెలుగు లో కూడా ఈ అమ్మడి క్రేజ్ తగ్గిందని.
అందుకే తక్కువ పారితోషికం ఇస్తున్నట్లుగా పేర్కొన్నారు.
ఎన్టీఆర్ 30 లో జాన్వీ కపూర్ దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది.ఆమె కు 80 లక్షల రూపాయల పారితోషికంతో పాటు పది లక్షల రూపాయల ఇతర అలవెన్స్ లు స్టాఫ్ ఖర్చులు ఇస్తున్నారని తెలుస్తోంది.అంటే కోటికి లోపే జాన్వీ కపూర్ పారితోషికం ఉంది.
ఎన్టీఆర్ 30 సినిమా లో ఆమె నటించి సక్సెస్ దక్కించుకుంటే అప్పుడు మళ్లీ కోటిన్నర వరకు ఈమె పారితోషికం డిమాండ్ చేసినా ఆశ్చర్యం లేదు.తెలుగు లో ఈమెకు మంచి డిమాండ్ ఉన్న సమయంలో నటించలేదు.
ఇప్పుడు బాలీవుడ్ లో ఆఫర్లు తగ్గడం వల్ల తెలుగు సినిమా లకు ఓకే చెబుతుంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.ముందు ముందు అయినా ఇక్కడ సెటిల్ అయ్యేనా చూడాలి.