కాంగ్రెస్ పగ్గాల కోసం శత విధాల ప్రయత్నించి చతికిల పడిన నేత తిరువనంతపురం ఎంపీ శశిథరూర్. అధిష్టానం ఏకగ్రీవంగా పార్టీ పగ్గాలను అప్పగించాలని అనుకుంటే ఆయన మాత్రం తన రూటే సపరేటు అంటూ పోటీకి సై అన్నాడు.
అయితే పైకి చెప్పక పోయినా.ఇది అధిష్టానానికి ఆది నుంచే పోటీ ఇష్టం లేదు.
ఇక రాహుల్ కే పగ్గాలు ఇవ్వాలని ఏడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పీసీసీలు తీర్మానాలు చేసి మరీ ఏఐసీసీకి అప్పగించారు.
అయితే రాహుల్ మాత్రం వాటిని పక్కన పెట్టి మరీ యాత్రకే మొగ్గు చూపారు.
జొడో యాత్ర నడుస్తుండగానే అధ్యక్ష ఎన్నికలు జరిగాయి.అయితే మొదట అనుకున్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ రాజకీయ చతురత చూపి తప్పించుకున్నారు.
అయితే అనాదిగా పార్టీని పట్టుకుని వస్తున్న ఖర్గేకు ఆ బాధ్యతలు తప్పలేదు.అఖండ మెజారిటీతో కాంగ్రెస్ శ్రేణులు ఖర్గేను గెలిపించారు.
అయితే అప్పటి నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడికి, అధిష్టానానికి థరూర్ పై కన్నుంది.ఆయన్ను ముప్పు తిప్పలు పెట్టాలని చాలా కాలంగా వేచి చూస్తోంది.
ఇక థరూర్ సైతం తనపై జరుగుతోన్న అంతర్గతర చర్చలను ఊహించి తన జాగ్రత్తల్లో తాను ఉంటున్నాడు.ఈ సారి తిరువనంతపురం ఎంపీ సీటును సైతం ఆయనకు ఇవ్వకుండా.
వేరే వారికి ఇవ్వాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి.దాంతో ఆయన కూడా పక్క చూపులు చూస్తున్నారు.
అందుకే ఆయన్ను పక్కన పెట్టడం సరికాదని.కనీసం రాజ్యసభ ఇచ్చి సముదాయించాలని చూస్తున్నారు.
అయితే అధిష్టానాన్ని వ్యతిరేకించే గ్రూప్ లో థరూర్ ఉండటంతో.ఆయనకు ఏం జరిగితే అదే మిగిలిన వారికి జరుగుతుంది అనే అనుమానం కూడాఉంది.అందుకే ఆయన్ను పంపకుండా.కాంగ్రెస్ కార్యకలాపాలలో పక్కన పెడుతున్నారు.ఏ చిన్న కార్యక్రమమైనా.ఆయనకు పిలుపు పంపడం లేదు.
దాంతో అసలు థరూర్ ప్రస్థుతం పార్టీలో ఉన్నారా.? లేరా అనే అనుమానాలు వస్తున్నాయి.మరి కాంగ్రెస్ అధిష్టానం థరూర్ ను పార్టీలో ఉంచి పక్కన పెడుతుందా.? లేక పార్టీ నుంచి సాగనంపుతారా చూడాలి.