భానుమతి. హీరోయిన్ గా, సింగర్ గా, దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా అమే ఒక కొండంత శిఖరం లాంటి వ్యక్తి.
కెరీర్ మొత్తం మీద ఎంతో నిక్కచ్చిగా ఉంటూనే అన్ని సాధించిన ఏకైక మహిళ.ఆ తరం లో చాలా మంది హీరోయిన్స్ మద్యానికి బానిసలను అయ్యి, సినిమాలు నిర్మించి ఉన్న డబ్బంతా పోగొట్టుకొని రోడ్డున పడితే భానుమతి మాత్రం ప్రతి ఒక్క విషయాన్ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసి విజయాలను దక్కించుకొని కోట్ల రూపాయల ఆస్తులను తన కుటుంబం కోసం కుడబెట్టారు.
భానుమతి జీవితం చివరి వరకు సినిమాలపై మంచి గ్రిప్ తో ఉన్నారు.ఇక ఆమెకు కొన్ని సరదా విషయాల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యేవారు.
అలాంటి సరదాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తె భానుమతి కి ఈత.దేవుడు అంటే పరమ భక్తి ఉన్న భానుమతి కి ఈత అంటే ఇష్టం అని బయట ఎవరికి తెలియదు.అమే తొలినాళ్లలో ఈత నేర్చుకొని తన ఇంట్లోని స్విమ్మింగ్ పూల్ లోనే ఈత కొట్టేవారు.ఆ తర్వాత తన తోటి హీరోయిన్స్ తో కూడా కలిసి బయట క్లబ్స్ మరియు పూల్స్ కి వెళ్లి కాస్త ఆటవిడుపు లాగా టైం స్పెండ్ చేసేవారు.
ఆమెకు ఉన్న ఇంట్రెస్ట్ ని ఇంట్లో కూడా ఎవరు కాదు అనేవాళ్ళు కాదు.అందుకే అమే ఎక్కువగా ఈత కోసం టైం పెట్టేవారు.
ఇక భార్య మామూలు బట్టల్లో ఈత కొడుతుంది కాబట్టి స్విమ్ సూట్ కొనిచ్చడట రామ కృష్ణ. పైగా భానుమతి ఈత కొడుతుంటే ఆయన ఫోటోలు తీసుకొని మురిసి పోయేవారట.అలా ఆయన తీసిన ఫోటోలను ఇంటికి ఎవరు వచ్చిన భానుమతి చూపిస్తూ సిగ్గు వొలకబోసే వారట.ఈ విషయం నిర్మాత కాట్రగడ్డ మురారి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాం లో షేర్ చేసుకున్నారు.
అంతే కాదు గతంలో భానుమతి కి ఈత అంటే ఇష్టం అంటూ ఆరుద్ర భార్య రామలక్ష్మి కూడా ఒక మీడియా ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపారు.