మెరీనాను అలా చూడలేకే హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను: బిగ్ బాస్ రోహిత్

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా ముగిసింది.ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి వారిలో కంటెస్టెంట్ రోహిత్ ఒకరు.

 I Told Her To Leave The House Without Seeing Marina Like That Bigg Boss Rohit ,-TeluguStop.com

ఈయన బుల్లితెర నటుడిగా తన భార్య మెరీనాతో కలిసి బిగ్ బాస్ సీజన్ సిక్స్ కార్యక్రమంలోకి అడుగుపెట్టారు.అయితే మెరీనా ఈ కార్యక్రమంలో దాదాపు 10 వారాలపాటు కొనసాగారు.

అనంతరం ఈమె ఎలిమినేట్ అయినప్పటికీ రోహిత్ మాత్రం 15వ వారం వరకు హౌస్ లో కొనసాగి టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా బయటకు వచ్చారు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కంటెస్టెంట్లు అందరూ కూడా ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే రోహిత్ సైతం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా రోహిత్ ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత నాలాంటి వాళ్లకు ప్రేక్షకులు ఓట్లు వేస్తారా అంటూ అనుమానంగా ఉండేది అయితే ఎప్పుడైతే తాను నామినేషన్ లోకి వెళ్లిన తర్వాత ప్రేక్షకులు నన్ను సేవ్ చేశారో అప్పుడు ఆటపై చాలా కాన్ఫిడెన్స్ పెరిగిందని తెలిపారు.

ఇక మెరీనా హౌస్ లో నామినేట్ అయిన ప్రతిసారి ఫిజికల్ టాస్కులలో ఎంతో కష్టపడుతూ ఉండేది.ఇలా తను కష్టపడటం చూసి ఇదంతా అవసరమా అనిపించింది.అందుకే తనని హౌస్ నుంచి వెళ్ళిపొమ్మని చెప్పాను.

మనసులో తాను హౌస్ లో ఉండాలని ఉన్నప్పటికీ తన కష్టం చూసి వెళ్లిపొమ్మని చెప్పక తప్పలేదని రోహిత్ గుర్తు చేసుకున్నారు.ఇక తనలో ఉన్న మైనస్ పాయింట్ల గురించి కూడా ఈయన తెలిపారు.

తాను ఒక వ్యక్తి గురించి ఏమనుకుంటున్నాను అని ఎక్స్ప్రెస్ చేయడం కష్టంగా ఉంటుందని అదే తనకు మైనస్ గా నిలిచిందని ఈ సందర్భంగా రోహిత్ వెల్లడించారు.ఇక బిగ్ బాస్ కార్యక్రమం తన కెరియర్ గ్రోత్ కు ప్రయోజనకరంగా ఉంటుందని ఆశిస్తున్నానని తెలిపారు.

ఇక బిగ్ బాస్ విన్నర్ రన్నర్ గురించి మాట్లాడుతూ నా దృష్టిలో వారిద్దరు విజేతలేనని రోహిత్ తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube