మరో నాలుగైదు రోజుల్లో 2022 సంవత్సరం ముగియబోతుంది.ఈ సంవత్సరం క్రికెట్‌లో ఎన్నో ఆసక్తికరమైన ఘటనలు చోటు చేసుకున్నాయి.
కాబట్టి ఓ ఆసక్తికరమైన అంశం గురించి ఇక్కడ మాట్లాడుకుందాము.క్రికెట్ క్రీడాభిమానులకు ఎనలేని ఓ కోరిక ఒకటి ఎప్పటినుండో వెంటాడింది.
అదే, తన అభిమాన క్రీడాకారుడు సెంచరీలు కొట్టడం అనే అంశం.టీమిండియాలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అయినటువంటి విరాట్ కోహ్లి ఈ సంవత్సరం అభిమానుల సుదీర్ఘ సెంచరీల కల కరువు తీర్చాడని చెప్పుకోవాలి.
అవును, గత కొన్ని సంవత్సరాలనుండి ఈ స్టార్ ఆటగాడు నిరంతరం మంచి పరుగులే చేస్తున్నప్పటికీ అభిమానులు అనుకున్న స్థాయిలో సెంచరీ చేయలేకపోయాడు.కాగా ఈ ఏడాది సెంచరీల కరువును ఈ బ్యాట్స్‌మెన్ తీర్చారు.
టీమిండియా రన్ మెషీన్ సెంచరీ కోసం కోట్లాది మంది అభిమానులు ఎదురు చూసారు.అతితక్కువ కాలంలోనే 70 అంతర్జాతీయ సెంచరీలు బాదిన కోహ్లీకి.71వ సెంచరీ కోసం చాలా రోజులే నిరీక్షించాల్సి వచ్చింది.ఒకసారి గతాన్ని తరచి చూస్తే, నవంబర్ 22, 2019న విరాట్ తన 70వ అంతర్జాతీయ సెంచరీని సాధించాడు.
ఆ తర్వాత సుదీర్ఘ విరామం తరువాత మైదానంలోకి తిరిగి వచ్చిన కోహ్లీ 2020లో 22 మ్యాచ్‌ల్లో 842 పరుగులు చేశాడు.కానీ సెంచరీ మాత్రం చేయలేకపోయాడు.అలాగే 2022 అర్ధ సంవత్సరం గడిచిపోయినా కూడా కింగ్ కోహ్లీ శతకం కోసం ఎదురుచూడాల్సి వచ్చింది.ఇక ఆసియా కప్ 2022లో అప్ఘానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కోహ్లీ 122 పరుగులు చేసి విజయ దుందుభి మోగించాడు.టీ20 ఇంటర్నేషనల్‌లో తన మొదటి సెంచరీని కూడా సాధించడంతో పాటు సుదీర్ఘ కరువుకు చెక్ పెట్టాడు.అలాగే నవంబర్‌లో బంగ్లాదేశ్‌పై 113 పరుగులు చేసి వన్డేల్లో 44వ సెంచరీని కూడా నమోదు చేసి అభిమానుల ఆకలి తీర్చాడు.