దేశంలో పెరుగుతున్న కల్తీ మద్యం మరణాలు... నిషేధం ఉన్నా ఆగని సారా ప్రవాహం!

బీహార్‌ రాష్ట్రంలో మూడు రోజుల వ్యవధిలో విషపూరిత మద్యం 66 మంది ప్రాణాలను బలిగొంది.ఒక్క ఛప్రాలోనే 61 మరణాలు సంభవించాయి.

 Which State Has Maximum Number Of Deaths Due To Poisonous Wine , Bihar,deaths ,-TeluguStop.com

సివాన్‌లో కూడా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.దీంతో బీహార్‌లో అమలవుతున్న మద్య నిషేధంపై మరోసారి అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

మద్యం కుంభకోణంతో రాష్ట్ర, దేశ రాజకీయాలు వేడెక్కాయి.సరిగ్గా ఇదే సమయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేసిన ప్రకటన వేడిని మరింత రాజేసింది.

మద్యం తాగి చనిపోయిన వారిపై తనకు సానుభూతి లేదని నితీశ్ అన్నారు.దీంతో విపక్షాలు బీహార్ ప్రభుత్వంపైనా, నితీష్‌పైనా విమర్శలు గుప్పిస్తున్నాయి.

కాగా దేశంలోని ఎన్ని రాష్ట్రాల్లో మద్య నిషేధం అమలులో ఉంది? దేశంలోని ఏయే రాష్ట్రాల్లో మద్యం వల్ల ఎన్ని మరణాలు సంభవిస్తున్నాయి, ఎక్కడ మద్యం నిషేధించారు? అక్కడ మద్యం ఎలా విక్రయిస్తున్నారు? మద్యం జనాలకు ఎలా చేరుతుంది? తదితర ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాం.

మద్యం వల్ల అత్యధిక మరణాలు సంభవించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్.2021లో దేశవ్యాప్తంగా నకిలీ మద్యం కారణంగా 782 మంది మృతిచెందారు.ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 137 మంది మరణించారు.

పంజాబ్‌లో 127 మంది, మధ్యప్రదేశ్‌లో 108 మంది, కర్ణాటకలో 104 మంది, జార్ఖండ్‌లో 60 మంది, రాజస్థాన్‌లో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా విధించిన లాక్డౌన్ మధ్యలో కూడా జనం విపరీతంగా మద్యం సేవించారు.2020లో దేశవ్యాప్తంగా నకిలీ మద్యం సేవించి 947 మంది మృతిచెందారు.మధ్యప్రదేశ్‌లో గరిష్టంగా 214 మంది, జార్ఖండ్‌లో 139 మంది, పంజాబ్‌లో 133 మంది, కర్ణాటకలో 99 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 67 మంది మృత్యువాత పడ్డారు.2019లో కల్తీ మద్యం వల్ల 1296 మంది మృతి చెందారు.కర్ణాటకలో గరిష్టంగా 268 మంది, పంజాబ్‌లో 191 మంది, మధ్యప్రదేశ్‌లో 190 మంది, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లో 115 మంది చొప్పున, అస్సాంలో 98 మంది, రాజస్థాన్‌లో 88 మంది మద్యం కారణంగా ప్రాణాలు కోల్పోయారు.2018లో కల్తీ మద్యం కారణంగా దేశవ్యాప్తంగా మొత్తం 1365 మంది మరణించారు.

Telugu Alchohal, Alcohol, Bihar, Nitish Kumar, Wine, Uttar Pradesh-Latest News -

మధ్యప్రదేశ్‌లో గరిష్టంగా 410, కర్ణాటకలో 218, హర్యానాలో 162, పంజాబ్‌లో 159, ఉత్తరప్రదేశ్‌లో 78, ఛత్తీస్‌గఢ్‌లో 77, రాజస్థాన్‌లో 64 మంది ప్రాణాలు కోల్పోయారు.బీహార్‌తో సహా అనేక రాష్ట్రాల్లో మద్య నిషేధం ఉన్నప్పటికీ, మద్యం రికవరీ కేసులు తెరపైకి వస్తుంటాయి.అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా చాలా చోట్ల మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతోంది.

చాలా చోట్ల అధికారుల నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది.కొన్ని చోట్ల అధికారులు, నాయకులు కూడా మద్యం అక్రమ రవాణాకు సహకరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అందుకే బీహార్ వంటి రాష్ట్రాల్లో మద్యాన్ని నిషేధించినా ప్రయోజనం లేకుండా పోతోంది.మొక్కుబడిగా అధికారులు కొందరిపై చర్యలు తీసుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube