వరుసగా రెండు ప్లాపుల తర్వాత మాస్ రాజా రవితేజ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.అయితే ఈసారి మరింత కాన్ఫిడెంట్ గా ఈయన సినిమా రిలీజ్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు.
ప్రెజెంట్ రవితేజ చేస్తున్న సినిమాల్లో త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ధమాకా ఒకటి.ఈ సినిమాను కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకుని వరుస ప్రొమోషన్స్ కూడా చేస్తూ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతున్నారు.ఈ సినిమాను మేకర్స్ క్రిస్మస్ బరిలో దింపబోతున్నారు.
డిసెంబర్ 23న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.దీంతో మేకర్స్ వరుస అప్డేట్స్ ఇస్తున్నారు.
ఇప్పటికే విడుదల అయిన సాంగ్స్, పోస్టర్స్, టీజర్, ట్రైలర్ అన్ని కూడా బాగా ఆకట్టుకున్నాయి.
ఈ సినిమాలో రవితేజకు జోడీగా పెళ్లి సందడి బ్యూటీ శ్రీలీల నటిస్తుంది.
అలాగే రవితేజ ఇందులో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడు.వివేక్ కూచిభట్ల సహా నిర్మాతగా టీజీ విశ్వ ప్రసాద్ భారీ స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
అలాగే భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ అందిస్తున్నారు.ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వచ్చింది.
రవితేజ సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా హిందీలో కూడా మంచి మార్కెట్ ఉంది.ఈయన కామెడీ టైమింగ్ నచ్చడంతో అక్కడ ప్రేక్షకులు రవితేజ సినిమాలకు మంచి రెస్పాన్స్ ఇస్తారు.ఇక తాజాగా ఈ సినిమాకు కూడా హిందీలో సాలిడ్ ధర పలికినట్టు గాసిప్స్ వస్తున్నాయి.ఏకంగా అక్కడ హిందీ రైట్స్ 20 కోట్లకి పైగానే అమ్ముడు పోయినట్టు చెబుతున్నారు.
ఇదే నిజమైతే మాస్ రాజా కెరీర్ లో ఇదే హైయెస్ట్ అని చెప్పవచ్చు.