యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ లో సందడి చేసిన విషయం తెలిసిందే.స్నేహితుడు గోపీచంద్ తో కలిసి వచ్చిన ప్రభాస్ పలు విషయాల గురించి బాలకృష్ణ తో ముచ్చటించాడని సమాచారం అందుతుంది.
తన పెళ్లి విషయం మొదలుకుని సినిమా ల విషయం వరకు ఎన్నో విషయాలను ప్రేక్షకుల ముందు ఈ షో ద్వారా ప్రభాస్ ఉంచబోతున్నాడు.ఈ ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అభిమానులు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ఎప్పుడో.కానీ ఎపిసోడ్ లో ప్రభాస్ కనిపించే తీరు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
గత కొన్నాళ్లుగా ప్రభాస్ అభిమానులు మిర్చి లుక్ కావాలంటూ డిమాండ్ చేస్తున్నారు.సాహో మరియు రాధేశ్యామ్ సినిమాల్లో ఆయన లుక్ విమర్శలు ఎదుర్కొంది.
ఏమాత్రం బాలేదంటూ చాలా మంది కామెంట్స్ చేశారు.
ఆదిపురుష్ సినిమా లో కూడా ప్రభాస్ యొక్క లుక్ విషయం లో విమర్శలు ఎదుర్కొన్నారు.
కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ లుక్ తోనే ప్రభాస్ అన్ని సినిమా లు నటిస్తున్నాడు.కనుక ఇక నుండి ప్రభాస్ యొక్క అభిమానులకు పండగ అన్నట్లుగా ఈ లుక్ ఉంది అంటూ ఆయన సన్నిహితులు మరియు అభిమానులు మాట్లాడకుంటున్నారు.
సోషల్ మీడియా లో ప్రభాస్ లుక్ గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న నేపథ్యం లో షో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పాన్ ఇండియా స్థాయిలో స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇంకా పీక్స్ కి వెళ్లాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.కొత్త లుక్ ఆయన కు మరింత సక్సెస్ తెచ్చి పెట్టాలని ఆశిద్దాం.ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ వచ్చే ఏడాది రెండు లేదా మూడు సినిమాలతో ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉందట.