చిరు, బాలయ్య చేసిన సాయం మరవలేనిది.. ఏవీఎస్ కొడుకు కామెంట్స్ వైరల్!

సినిమా రంగంలో తన కామెడీ టైమింగ్ తో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న స్టార్ కమెడియన్లలో ఏవీఎస్ ఒకరు.ఏవీఎస్ కొడుకు ప్రదీప్ ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ నాన్నకు లివర్ ట్రాన్స్ ప్లాంట్ చేయించాలని అనుకున్న సమయంలో చిరంజీవి గారు, బాలయ్య గారు, దాసరి గారు సహాయం చేశారని అన్నారు.

 Avs Son Pradeep Comments About Chiranjeevi And Balakrishna Details, Avs Son Prad-TeluguStop.com

పవన్ కళ్యాణ్, నాగబాబు కూడా సహాయం చేశారని ఆయన తెలిపారు.

నాన్న అందరితో సన్నిహితంగా మెలిగేవారని అలా చేయడమే ఆయనను కాపాడిందని ప్రదీప్ అన్నారు.

ఆపరేషన్ సమయంలో మురళీమోహన్ గారు మొత్తం అమౌంట్ కట్టేశారని ఆయన కామెంట్లు చేశారు.చిరంజీవి, శ్రీకాంత్ రాత్రి సమయంలో ఆస్పత్రికి వచ్చి నాన్న దగ్గర కూర్చుకున్నారని ప్రదీప్ తెలిపారు.

నాన్న చనిపోయిన తర్వాత నేను సెలబ్రిటీలను ఎవరినీ కలవలేదని ఆయన పేర్కొన్నారు.

ఫైనాన్షియల్ గా ఎవరినీ హెల్ప్ అడగకూడదని ప్రదీప్ వెల్లడించారు.

Telugu Avs Son Pradeep, Avsson, Balakrishna, Chiranjeevi, Avs, Murali Krishna, P

హీరోలకు సహాయం చేసే మనస్సు ఉన్నా మంచి పరిచయాన్ని చెడగొట్టుకోవడం ఎందుకు అని అనిపిస్తుందని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.నేను ఇప్పటికీ అడిషన్స్ కు వెళతానని ప్రదీప్ అన్నారు.నాన్నగారి పేరును వాడుకుని ఛాన్స్ లు సంపాదించుకోవడం కరెక్ట్ కాదని నేను భావిస్తానని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

Telugu Avs Son Pradeep, Avsson, Balakrishna, Chiranjeevi, Avs, Murali Krishna, P

అలా ఛాన్స్ తీసుకుని సరిగ్గా చేయకపోతే నాన్న పేరు చెడగొట్టినట్టు అవుతుందని ప్రదీప్ అన్నారు.నా దగ్గర 172 కథలు ఉన్నాయని ఆయన కామెంట్లు చేశారు.సినిమాల్లో కెరీర్ ను కొనసాగించడం నాకు ఇష్టమని ప్రదీప్ వెల్లడించారు.

కరోనా సమయంలో నేను చాలా ఇబ్బందులు పడ్డానని ఆయన పేర్కొన్నారు.రెమ్యునరేషన్ విషయంలో నాన్నకు ఎప్పుడూ ఇబ్బందులు ఎదురుకాలేదని ఆయన కామెంట్లు చేయడం గమనార్హం.

నాన్నగారు రోజుకు లక్షన్నర రూపాయల చొప్పున రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆయన అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube