ఈ ఏడాది ఆఖరి నెల వచ్చేసిన కూడా సినిమాలు మాత్రం బాగా జోరుగా విడుదలవుతున్నాయి.స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతికి రిలీజ్ కానుండగా.
చిన్న హీరోల సినిమాలు మాత్రం వరుసగా విడుదలవుతున్నాయి.గత వారం మాత్రం చాలా సినిమాలు థియేటర్ లో విడుదలై బాగా సందడి చేశాయి.
అయితే ఈవారం కూడా సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండగా ఈ వారం మాత్రం అంతంత గానే ఉన్నట్లు అనిపిస్తున్నాయి.ఇక ఈవారం థియేటర్లో, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం.
డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా అవతార్ 2. ఇక ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.వేణు మడికంటి దర్శకత్వంలో రూపొందిన సినిమా శాసనసభ. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, సోనియా అగర్వాల్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమా కూడా 16న విడుదల కానుంది.
![Telugu Akrosham, Avatar, Pasivadi Pranam, Sashanasabha, Sundarangudu-Movie Telugu Akrosham, Avatar, Pasivadi Pranam, Sashanasabha, Sundarangudu-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/12/movies-coming-this-week-in-theaters-and-ott-avatar2-sashanasabha-akrosham-sundarangudu-detailsd.jpg )
జిఎన్ఆర్ కుమరవేలన్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఆక్రోషం. ఇక ఈ సినిమా కూడా డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఎన్ఎస్ మూర్తి దర్శకత్వంలో రూపొందిన సినిమా పసివాడి ప్రాణం.
ఈ సినిమాలో అల్లు వంశీ, ఇతి ఆచార్య జంటగా నటించిన ఈ సినిమా 16న థియేటర్లో విడుదల కానుంది.ఏపీ అర్జున్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ఐ లవ్ యు ఇడియట్.
ఈ సినిమా కన్నడ మూవీ నుండి రీమేక్ గా తీసుకోగా 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.డైరెక్టర్ వినయ్ బాబు దర్శకత్వంలో రూపొందిన సినిమా సుందరాంగుడు.
ఇక ఈ సినిమా కూడా డిసెంబర్ 17న విడుదల కానుంది.
![Telugu Akrosham, Avatar, Pasivadi Pranam, Sashanasabha, Sundarangudu-Movie Telugu Akrosham, Avatar, Pasivadi Pranam, Sashanasabha, Sundarangudu-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/12/movies-coming-this-week-in-theaters-and-ott-avatar2-sashanasabha-akrosham-sundarangudu-detailssa.jpg )
ఇక ఓటీటీలో రానున్న సినిమాలు, సీరిస్ లు ఏవో తెలుసుకుందాం.
ఆహాలో ఇంటింటి రామాయణం డిసెంబర్ 16న స్ట్రీమింగ్ కానుంది.నెట్ఫ్లిక్స్ లో డాక్టర్ జి అనే హిందీ సిరీస్ డిసెంబర్ 11న స్ట్రీమింగు కానుంది.
అరియిప్పు అనే మలయాళం మూవీ, కోడ్ నేమ్: స్థిరంగా అనే హిందీ మూవీ, ఇండియన్ ప్రిడేటర్: బెస్ట్ ఆఫ్ బెంగళూరు అనే హిందీ సిరీస్, ద రిక్రూట్ అనే వెబ్ సీరిస్ లు డిసెంబర్ 16న స్ట్రీమింగ్ కానున్నాయి.
![Telugu Akrosham, Avatar, Pasivadi Pranam, Sashanasabha, Sundarangudu-Movie Telugu Akrosham, Avatar, Pasivadi Pranam, Sashanasabha, Sundarangudu-Movie](https://telugustop.com/wp-content/uploads/2022/12/movies-coming-this-week-in-theaters-and-ott-avatar2-sashanasabha-akrosham-sundarangudu-detailss.jpg )
ఇక జీ ఫైవ్ లో స్ట్రాంగ్ ఫాదర్స్, స్ట్రాంగ్ డాటర్స్ అనే హాలీవుడ్ మూవీ డిసెంబర్ 12న స్ట్రీమింగ్ కానుంది.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేషనల్ ట్రెజర్: ఏడ్జ్ఆఫ్ హిస్టరీ అనే వెబ్ సిరీస్ డిసెంబర్ 14న, గోవింద నామ్ మేరా హిందీ మూవీ డిసెంబర్ 16న స్ట్రీమింగ్ కానున్నాయి.అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిజిక్స్ వాలా అనే హిందీ సిరీస్ డిసెంబర్ 15న స్ట్రీమింగ్ కానున్నాయి.
ఇక ఈవారం చాలా తక్కువ సినిమాలు ఉన్నప్పటికీ కూడా మంచి మంచి కంటెంట్లు ఉన్న సినిమాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.ఇక ఇందులో ఎన్ని సక్సెస్ అవుతాయో చూడాలి.