మొటిమలకు కారణం అయ్యే ఆహారాలు

ఈ రోజుల్లో ఆడ,మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎదుర్కొనే సమస్యమొటిమలు.ఈ సమస్య జీవితంలో ఎదో ఒక సమయంలో ప్రతి ఒక్కరినీ బాధిస్తుంది.

సాధారణంగా మొటిమలు అనేవి ఒత్తిడి, హార్మోన్లలో అసమతుల్యత, మీరు తీసుకొనే ఆహార పదార్థాల వల్ల కూడా సంభవించవచ్చు.ఇప్పుడు ఆ ఆహార పదార్ధాల గురించి తెలుసుకుందాం.

బ్రెడ్

బ్రెడ్ శరీరంలో యాంటీ ఆక్సిడెంట్స్ స్థాయిలను తగ్గిస్తుంది.దాంతో మొటిమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

బ్రెడ్ లో గ్లూటెన్ ఉండటం వలన మొటిమలను కలిగిస్తుంది.అందువల్ల మీ డైట్ నుంచి బ్రెడ్ ని తొలగించండి.

Advertisement

చాక్లెట్

చాక్లెట్ అంటే దాదాపుగా అందరికి ఇష్టమే.చాక్లెట్ మానాలంటే కష్టమే.అయినా మొటిమలు తగ్గాలంటే చాక్లెట్ తినటం మానాలి.

చాక్లెట్ లో ఉండే కొవ్వు,చక్కెరలు మీ శరీరంపై మంటను కలిగించే సెబమ్ తైలాన్ని అధికంగా ఉత్పత్తి చేసే విధంగా ప్రోత్సహిస్తాయి.దాంతో అది మొటిమలకు కారణం అవుతుంది.

జున్ను

జున్నులో ప్రొజెస్టెరాన్ సమృద్ధిగా ఉండుట వలన కొవ్వు ఉత్పత్తి గ్రంధులను అధిక మొత్తంలో పెంచుతుంది.దీనితో చర్మం జిడ్డుగా మారి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

కాబట్టి మీ ఆహారం నుండి జున్నును తొలగించండి.

మిల్క్ పౌడర్‌లో వైన్ కలిపిన అమ్మమ్మ.. కోమాలోకి వెళ్లిపోయిన పిల్లోడు..??
ఎముక‌ల బ‌ల‌హీన‌త‌కు చెక్ పెట్టే అద్భుత‌మైన ఆకుకూర‌లు ఇవే!

బంగాళ దుంప చిప్స్

బంగాళ దుంప చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బాగా వేయించిన ఆయిల్ ఫుడ్స్ తీసుకోవటం పూర్తిగా మానేయాలి.ఇవి చర్మంపై వాపును కలిగించటానికి కారణం అవుతాయి.అది మొటిమలకు కారణం అవుతుంది.

Advertisement

కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ ఆహారాలను మానేయటమే ఉత్తమం.

తాజా వార్తలు