కూతురు విషయంలో ఆందోళన చెందుతున్న రణబీర్.. ఏమైందంటే?

బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ అలియా భట్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం మనకు తెలిసిందే.ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.

 Ranbir Is Worried About His Daughter What Happened, Ranbir ,daughter, What Happ-TeluguStop.com

ఇలా వీరి వివాహమైనటువంటి కొన్ని నెలలకే ప్రెగ్నెంట్ అని తెలియజేయడమే కాకుండా గత నెలలో ఈమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు.ఇలా కూతురికి జన్మనిచ్చి తల్లిదండ్రులుగా మారినటువంటి ఆలియా భట్ రణబీర్ ప్రస్తుతం తమ సమయాన్ని అంత తన కూతురితోనే గడుపుతున్నారు.

కూతురు జన్మించిన తర్వాత రణబీర్ కపూర్ సినిమా షూటింగ్లలో కూడా చాలా తక్కువగా పాల్గొని తన విలువైన సమయాన్ని తన కూతురితో గడపడానికి ఇష్టపడుతున్నారు.

ఇకపోతే తాజాగా రణబీర్ కపూర్ సౌత్ అరేబియాలోని జెడ్డాలో జరిగిన రెడ్ సీ ఫిల్మ్ ఫెస్టివల్ లో పాల్గొన్న రణబీర్ తన సినిమా విషయాలతోపాటు తన కుమార్తె గురించి కూడా పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

ముఖ్యంగా తన కూతురి విషయంలో తాను ఒక అ భద్రతకు లోనవుతున్నానని ఈయన తెలిపారు.ఈ సందర్భంగా రణబీర్ కపూర్ మాట్లాడుతూ ప్రస్తుతం తనకు 40 సంవత్సరాలు తన కూతురికి 20 సంవత్సరాలు వచ్చే సమయానికి తనకు 60 సంవత్సరాలు వస్తాయని ఆ సమయంలో నేను తన కూతురితో కలిసి ఏ విధమైనటువంటి ఆటలు ఆడలేక పోతాననే భావన తనలో కలుగుతుందని ఇది తనని చాలా అభద్రతకు గురి చేస్తుందని ఈయన తెలిపారు.

Telugu Ranbir, Worried-Movie

ఇకపోతే తమ కూతురి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి కూడా ఈ సందర్భంగా ఈయన తెలిపారు.తాను ఏడాదిలో సుమారు 200 రోజుల వరకు పనిచేస్తూ ఉంటాను.కానీ నాకన్నా అలియా ఎక్కువ రోజులు బిజీగా ఉంటుంది.అందుకే నేను షూటింగ్లో ఉన్నప్పుడు తాను ఇంటిదగ్గర పిల్లలతో టైం స్పెండ్ చేయాలని అలాగే తాను షూటింగ్లో ఉన్నప్పుడు నేను పిల్లల కోసం టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నామని ఈ సందర్భంగా పిల్లల గురించి రణబీర్ కపూర్ దంపతులు తీసుకున్నటువంటి నిర్ణయం గురించి ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube