జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి రోజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు.పవన్ చేసిన వ్యాఖ్యలపై సీఎం జగన్ స్పందించాల్సిన పని లేదని చెప్పారు.
వపన్ కల్యాణ్ దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టార్ అని విమర్శించారు.పవన్ వాహనం వారాహి కాదు.
అది నారాహి అని ఎద్దేవా చేశారు.కత్తులతో ఎవరితో యుద్ధం చేయాలో పవన్ కు తెలియడం లేదని తెలిపారు.ఎవరి సైన్యంలోనో దూరి యుద్ధం చేయాలని పవన్ చూస్తున్నారని ఆరోపించారు.175 స్థానాల్లో కనీసం అభ్యర్థులను కూడా నిలబెట్టలేని పార్టీ జనసేన అని వెల్లడించారు.వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో వైసీపీ గెలిచి పవన్, చంద్రబాబును హైదరాబాద్ కు జగన్ పంపడం ఖాయమని స్పష్టం చేశారు.