తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు సీరియల్ నటి అస్మిత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగులో పలు సీరియల్స్ లో నటించి బుల్లి తెర పేక్షకులకు చేరువ అయ్యింది.
సీరియల్స్ లో పాటు సినిమాలలో కూడా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి అస్మిత.అయితే అని ఒక వైపు సీరియల్స్ వెండి ధర పై సినిమా నటిస్తున్న సమయంలో ఆమెకు వచ్చిన ఒక ఆలోచన ఆమెకు సక్సెస్ ని తెచ్చి పెట్టింది.
యాష్ ట్రిక్స్ ప్రస్తుతం డిజిటల్ మీడియాలోనే కాకుండా బ్రాండ్ గా అవతరించింది.మేకప్ కిట్ ఏ విధంగా తయారు చేసుకోవాలి ఏమిటి అని ఎక్కడ దొరుకుతుంది ఇలాంటి వీడియోలు అలాగే మోటివేషనల్ వీడియోలు అందరికీ ఎంతో బాగా నచ్చాయి.
ఆ విధంగా అస్మిత యూట్యూబ్ గా చేసిన ప్రయాణం ప్రస్తుతం ఒక సక్సెస్ స్టోరీ గా మారింది.ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె A1 from Day 1 అనే వెబ్ సిరీస్ ను రూపొందించింది.
ఈ వెబ్ సిరీస్ కు ప్రివ్యూ యాష్ ట్రిక్స్ ఫ్యామిలీని ప్రత్యేక అతిధులుగా ఆహ్వానించారు.ఈ క్రమంలోనే అస్మిత మాట్లాడుతూ.నటిగా నా కెరియర్ బిజీ బిజీగా ఉన్న సమయంలో నేను డిజిటల్ మీడియా వైపు అడుగులు వేశాను.టీవీ సీరియల్స్ లో వరుసగా అవకాశాలు రావడంతో బిజీ బిజీగా మారాను.
వెండితెరపై సినిమా అవకాశాలు కూడా బాగానే ఉన్నాయి.ఆ సమయంలో ఇప్పుడు ఇదంతా ఏంటి అని ప్రశ్నలు తోటి నటీనటుల నుంచి వచ్చాయి దీని ఎవరు చూస్తారు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేశారు.
అయితే అప్పుడు నన్ను ఎగతాళి చేసిన వారందరూ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ మొదలు పెట్టడం ఆనందంగా ఉంది.యాష్ ట్రిక్స్ విజయం వెనుక నా భర్త సుదీర్ సహకారం కూడా చాలా ఉంది అని చెప్పకు వచ్చింది అస్మిత.అదేవిధంగా పెళ్లి పిల్లలతో మహిళల కెరియర్ ఆగిపోతుంది అనే కాన్సెప్ట్ నాకు అసలు అర్థం కాదు ఆ విషయాన్ని నేను నమ్మను.ఇక అదే నమ్మకంతో నేను యాష్ ట్రిక్స్ మొదలు పెట్టాను.
కానీ మొదట ఎలాంటి వీడియోలు చేయాలి అని ఆలోచించే వాళ్ళం .ఇప్పుడు యాష్ ట్రిక్స్ నుంచి ఒక వెబ్ సిరీస్ విడుదల చేస్తున్నాము.సుధీర్ నేను భార్యాభర్తలు గా నటిస్తున్న ఈ సినిమాలో కమెడియన్ ఆలీ కూడా ముఖ్యపాత్రలో నటించారు.నేడు ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.దీనిని చూడడం కోసం 59 రూపాయలు ధర నిర్ణయించాము.మా సిరీస్ సబ్ స్క్రిప్షన్ మొదలయ్యింది అది తప్పకుండా ప్రయత్నం సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాను అని చెప్పుకొచ్చింది అస్మిత.