గన్నవరం టీడీపీ లో ఇంత జరుగుతోందా ?

2019 ఎన్నికల తర్వాత నుంచి ఏదో ఒక వ్యవహారంతో గన్నవరం నియోజకవర్గ నిత్యం వార్తల్లోనే ఉంటూ వస్తుంది.వైసిపి టిడిపిలలో ఎప్పుడు ఏదో ఒక అలజడి ఈ నియోజకవర్గంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది.

 Is This Happening In Gannavaram Tdp , Gannavaram, Gannavaram Tdp, Chandrababu, Y-TeluguStop.com

ఇక్కడి నుంచి 2019లో టిడిపి నుంచి గెలిచిన వాళ్ళ మీద వంశీ మోహన్ ఆ తరువాత వైసిపికి అనుబంధంగా కొనసాగుతున్నారు.టిడిపికి రాజీనామా చేసినా,  అధికారికంగా ఆ పార్టీ ఎమ్మెల్యే గానే కొనసాగుతున్నారు.

ఇక నిత్యం చంద్రబాబు,  లోకేష్ తో పాటు , ఆ పార్టీలో కీలక నాయకుల పైన వంశీ విమర్శలు చేస్తూ ఉంటారు.

వంశీ వైసిపి వైపు వెళ్లడంతో గన్నవరం తెలుగుదేశం పార్టీని నడిపించే నాయకుడు కోసం చంద్రబాబు చాలాకాలంగా కస్తరత్తే చేసి మచిలీపట్నానికి చెందిన బచ్చుల అర్జునుడిని గన్నవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జిగా నియమించారు.

ఇక ఆయన ఆధ్వర్యంలోని పార్టీ కార్యక్రమాలను చేపడుతున్నారు.అయితే అక్కడ అర్జునుడు ఒక వర్గాన్ని మాత్రమే ప్రోత్సహిస్తూ.

మొదటి నుంచి టిడిపిని నమ్ముకున్న వారిని పక్కన పెడుతున్నారనే ఆరోపణలతో మరో వర్గం స్వయంగా అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తూ వస్తోంది.చాలామంది పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారట.

నియోజకవర్గంలో పార్టీ సమస్యలపై అర్జునుడు వద్దకు తీసుకెళుతుండగా వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని,  ఎవరికి ఎప్పుడు ఏం చేయాలో తనకు తెలుసునని నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని అధినేతకు ఫిర్యాదులు చేశారట. 

Telugu Chandrababu, Gannavaram, Gannavaram Tdp, Kharma, Ysrcp-Political

అంతేకాకుండా బచ్చుల అర్జునుడు ఇన్చార్జిగా నియామకం అయిన తర్వాత దాదాపు పది మంది వరకు పార్టీ నేతలను సస్పెండ్ చేశారని , ఇలా అయితే గన్నవరం నియోజకవర్గంలో టిడిపి ఏ విధంగా బలోపేతం అవుతుందని ప్రశ్నను లేవనెత్తుతున్నారు.ఇటీవల ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమానికి వెళ్తున్న చంద్రబాబును బచ్చుల అర్జునుడి వ్యతిరేకవర్గం అంత స్వాగతం పలికారట.ఈ సందర్భంగా అర్జునుడు వైఖరిపై ఫిర్యాదు చేశారట.

ఇక మరోవైపు బచ్చుల అతను అనుచరులు మరోచోట చంద్రబాబుకు స్వాగతం ఏర్పాట్లు చేయడంతో, ఓకే నియోజకవర్గంలో రెండు చోట్ల స్వాగతాలు ఏర్పాటు చేయడంపై చంద్రబాబు సైతం షాక్ తిన్నారట.త్వరలోనే ఈ నియోజకవర్గ సమస్యలు , గ్రూపు రాజకీయాలపై దృష్టి పెట్టి , సమస్యలను పరిష్కరిస్తానని బాబు రెండు వర్గాల నేతలకు హామీ ఇచ్చినట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube