Meena Heroine : ఎవరు చెప్పారు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని.. హీరోయిన్ మీనా ఫైర్!

తెలుగు సినీ ప్రేక్షకులకు ఒకప్పటి సీనియర్ హీరోయిన్ మీనా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మీనా ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉంది.

 Meena Clarity About Her Second Marriage Rumors , Meena, Second Marriage , Social-TeluguStop.com

కాగా ఇటీవలే మీనా భర్త మరణించిన విషయం తెలిసిందే.అయితే ఆ బాధ నుంచి బయటపడటం కోసం సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది మీనా.

ఈ క్రమంలోనే తెలుగు, తమిళం మలయాళం అని తేడా లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.ఇక ఇది ఇలా ఉంటే ఇప్పటికే సోషల్ మీడియాలో పలుసార్లు మీనా రెండవ పెళ్లి చేసుకోబోతోంది అంటూ అనేక రకాల వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

అయితే అవన్నీ కూడా రూమర్లు గానే మిగిలిపోయాయి.గత రెండు రోజులుగా మళ్ళీ మీనా రెండో పెళ్లికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.మీనా ఒంటరిగా ఉండకూడదు అని ఆమె తల్లిదండ్రులు భావించి వారి బంధువుల్లో ఒక వ్యక్తితో సంబంధం మాట్లాడారని మీనా కూడా అందుకు ఒకే చెప్పిందని త్వరలోనే మీనా రెండో పెళ్లి చేసుకోబోతోంది అంటూ రకరకాలుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా ఆ వార్తలపై మీనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీనా ఆ వార్తలపై స్పందిస్తూ.బుద్ధి ఉందా.

డబ్బు కోసం ఏమైనా చేస్తారా.ఎవరు చెప్పారు నేను రెండో పెళ్లి చేసుకుంటున్నానని.

సోషల్ మీడియా రోజురోజుకి దిగజారి పోతోంది.

Telugu Meena, Tollywood-Movie

నిజా నిజాలు తెలుసుకొని రాయండి.దిగజారి ప్రవర్తించకండి.నా భర్త చనిపోయినప్పుడు కూడా సోషల్ మీడియాలో ఎన్నో రకాల తప్పుడు ప్రచారాలు చేశారు.

అవి ఇప్పటికి కూడా ఆగలేదు.ఇటువంటి వార్తలు పుట్టించే వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకునేలా చేస్తాను అంటూ తీవ్ర స్థాయిలో మండిపడింది మీనా.

అయితే మీనా మాట్లాడిన మాటల్ని బట్టి చూస్తే రెండవ పెళ్లి వార్తల్లో ఎటువంటి నిజం లేదని తేలిపోయింది.ఈ వార్తలపై స్పందించిన పరువులు నెటిజన్స్ ఆమె మనసుకు ఎంత బాధ కలిగి ఉంటే ఆమె అంతలా కోప్పడి ఉంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube