టాలీవుడ్ సూపర్ స్టార్ నటశేఖరుడు కృష్ణ మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.కృష్ణగారి మరణంతో ఇండస్ట్రీలో ఒక శకం ముగిసింది.
ఇక కృష్ణ గారి మరణం మహేష్ బాబు కుటుంబ సభ్యులకు తీరని శోకమని చెప్పాలి.ఒకే ఏడాదిలోనే మహేష్ బాబు కుటుంబంలో తన అన్నయ్య తల్లి తండ్రి ఇలా ముగ్గురిని కోల్పోవడంతో మహేష్ శోకసంద్రంలో మునిగిపోయారు.
ఇకపోతే కృష్ణ గారి మరణించి 12 రోజులు కావడంతో ఆయన పెద్దకర్మను హైదరాబాదులో ఫంక్షన్ హాల్లో ఎంతో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు కుటుంబ సభ్యులతో పాటు ఘట్టమనేని ఫ్యామిలీ అలాగే పలువురు సినీ సెలబ్రిటీలు అభిమానులు కూడా పాల్గొన్నారు.
ఈ క్రమంలోనే ఘట్టమనేని ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణ గారికి ఘనంగా నివాళులు అర్పించడమే కాకుండా కృష్ణ గారిని గుర్తు చేసుకుని ఎంతో ఎమోషనల్ అయ్యారు.ఇక ఈ కార్యక్రమంలో భాగంగా మహేష్ బాబు వేదికపై మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడమే కాకుండా తన తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు.

ఈ సందర్భంగా మహేష్ బాబు మాట్లాడుతూ నాన్నగారు నాకు ఎన్నో ఇచ్చారు.ఇలా వాటిలో నాకు ఎంతో ముఖ్యమైనది మీ అభిమానం.ఇప్పుడు ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఎప్పటికీ నా గుండెల్లో మీ గుండెల్లో ఉంటారు అంటూ ఈ సందర్భంగా కృష్ణ గారిని తలుచుకొని మహేష్ బాబు వేదికపై ఎమోషనల్ అయ్యారు.ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది మహేష్ బాబుకు ధైర్యంగా ఉండాలంటూ కామెంట్లు చేస్తున్నారు.