సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు నాలుగు పదుల వయసు దాటినా కూడా పెళ్లి చేసుకోకుండా అలాగే ఉంటారు.అయితే కొంతమంది సెలబ్రిటీలకు లేటుగా పెళ్లి అయినప్పటికీ తొందరగా పిల్లలు అవుతూ ఉంటారు.
అలా లేటు వయసులో కూడా తల్లిదండ్రుల ఈ అభిమానులకు షాక్ ఇస్తుంటారు సెలబ్రిటీలు.కాగా బాలీవుడ్ కి చెందిన నటుడు కూడా ఏకంగా 51 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్నాడు.
అందుకు సంబంధించిన విషయాన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు బాలీవుడ్ నటుడు.అతను మరెవరో కాదు మనోజ్ తివారి.
51 ఏళ్ల వయసులో ముచ్చటగా మూడోసారి తండ్రి కాబోతున్న విషయాన్ని మనోజ్ తివారి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.ఈ క్రమంలోనే తన భార్య సురభి తివారి గోద్ బారై సీమంతం ఫంక్షన్ కి సంబంధించిన వీడియోని షేర్ చేశాడు మనోజ్ తివారి.
ఇందుకు సంబంధించిన వీడియో ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం.ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను అని క్యాప్షన్ ను కూడా రాసుకొచ్చాడు మనోజ్ తివారి.
కాగా ఈ వీడియోని చూసిన అభిమానులు మనోజ్ తివారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
అలాగే పలువురు సెలబ్రిటీలు కూడా ఈ వీడియో పై స్పందించారు.ఈ నేపథ్యంలోనే మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్ దీపక్ ఠాకూర్ స్పందిస్తూ నిన్ను ఆ భగవంతుడు చల్లగా దీవించాలి అని కామెంట్ చేశాడు.ఇక మనోజ్ అభిమానులు అతనికి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే మనోజ్ తివారి 1999లో రాణి తివారి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు.ఆ దంపతులకు రితి అనే పాప కూడా పుట్టింది.
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ దంపతులు 2012లో విడాకులు తీసుకుని విడిపోయారు.ఆ తర్వాత మనోజ్ తివారి సురభిని పెళ్లి చేసుకోగా ఈ దంపతులకు 2020లో పాప పుట్టింది.
తాజాగా మరొకసారి అతడు తండ్రి కాబోతున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాగా మనోజ్ తివారి హిందీ బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొన్న విషయం తెలిసిందే.