Pulsar Pro150 bike : కొత్త బజాజ్ పల్సర్ ఇండియాలో లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త పల్సర్ P150ని ఇండియాలో రూ.1.17 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరతో రిలీజ్ చేసింది.ఈ బైక్ సింగిల్-డిస్క్, ట్విన్-డిస్క్ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.

 New Bajaj Pulsar Launched In India.. Price, Specifications Are The Same ,pulsar-TeluguStop.com

సింగిల్-డిస్క్ వేరియంట్‌లో సింగిల్ సీటు, ట్విన్-డిస్క్ వేరియంట్‌లో స్ప్లిట్ సీటు వస్తుంది.ఈ కొత్త బైక్ బై-ఫంక్షనల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో కొత్త ఏరోడైనమిక్ 3D ఫ్రంట్‌తో వస్తుంది.

బజాజ్ పల్సర్ P150 రేసింగ్ రెడ్, కరేబియన్ బ్లూ, ఎబోనీ బ్లాక్ రెడ్, ఎబోనీ బ్లాక్ బ్లూ, ఎబోనీ బ్లాక్ వైట్ అనే కలర్‌ ఆప్షన్స్‌లో అందించబడుతుంది.ఈ బైక్ సీటు హైట్ 790 మిల్లీమీటర్ల కాగా దీనిని షార్ట్ రైడర్స్ కూడా ఈజీగా రైడ్ చేయవచ్చు.

స్ప్లిట్ సీట్ వెర్షన్‌లో ముందు 260 మిమీ డిస్క్ యూనిట్, వెనుక 230 మిమీ డిస్క్ యూనిట్‌ను కంపెనీ ఆఫర్ చేసింది.ఇక సింగిల్ సీట్ వేరియంట్ ముందు 260మిమీ డిస్క్, వెనుక 130మిమీ డ్రమ్‌తో వస్తుంది.

Telugu Bike, Bajaj Bike, Pulsar Bike-Latest News - Telugu

అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, కొత్త మోనో-షాక్ రియర్ సస్పెన్షన్‌, ఇన్ఫినిటీ డిస్‌ప్లే కన్సోల్, యూఎస్‌బీ మొబైల్ ఛార్జింగ్, గేర్ పొజిషన్ ఇండికేటర్, డిస్టెన్స్ టు ఎంప్టీ రీడౌట్, సింగిల్-ఛానల్ ABS వంటి కొన్ని ముఖ్యమైన ఫీచర్లు ఈ మోటార్‌సైకిల్‌ రెండు వేరియంట్స్‌లో అందించారు.పల్సర్ P150 కొత్త 149.68సీసీ ఇంజన్‌తో వస్తుంది.ఇది 8,500 ఆర్‌పీఎమ్ వద్ద 14.3 బీహెచ్పీ, 6,000 ఆర్‌పీఎమ్ వద్ద 13.5 Nm గరిష్ఠ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది.ఈ బైక్‌ను ఇప్పటికే కోల్‌కతాలో విడుదల చేయగా.రాబోయే వారాల్లో దేశవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.దీని ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 14 లీటర్లు.కెర్బ్ వెయిట్ 140 కిలోలు కాగా లీటర్ పెట్రోల్‌కి మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది ఇంకా తెలియ రాలేదు.

దీనిలో 17 అంగుళాల టైర్లు ఇచ్చారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube