సాధారణంగా ఒక సినిమా విడుదలై నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువస్తే నిర్మాతలు చిత్ర బృందానికి కానుకలు ఇవ్వడం జరుగుతుంటుంది.ఇలా ఇప్పటికే పలువురు హీరోలకు దర్శకులకు నిర్మాతలు ఖరీదైన కానుకలు ఇవ్వడం మనం చూస్తున్నాము.
అయితే చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే సినిమా విడుదల కాకుండానే చిత్ర బృందానికి కానుకలు ఇవ్వడం జరుగుతుంది.ఈ క్రమంలోనే తాజాగా నిర్మాత చెరుకూరి సుధాకర్ రావు నాని హీరోగా నటిస్తున్న దసరా చిత్ర బృందానికి ఏకంగా ఐఫోన్లను కానుకగా ఇచ్చినట్టు సమాచారం.
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చెరుకూరి సుధాకర్ నిర్మాతగా పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం దసరా.ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.అయితే ఈ సినిమా స్క్రిప్ట్ విన్న తర్వాత ఈ సినిమా కోసం ఎంతో కృషి చేస్తున్నటువంటి చిత్ర బృందానికి నిర్మాత సుధాకర్ ఏకంగా 28 ఐఫోన్లను కానుకగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
ఐఫోన్ 14 బ్రాండ్ న్యూ మొబైల్ ఫోన్లను చిత్ర బృందానికి కానుకగా ఇచ్చారనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీంతో మామూలుగా సినిమా హిట్ అయిన తర్వాత గిఫ్ట్ లు ఇస్తారు కానీ విడుదలకు ముందే ఇలా గిఫ్ట్ ఇవ్వడం చూస్తుంటే సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాత బలంగా నమ్మినట్టు తెలుస్తోంది.ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ టీజర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.ఇక ఈ సినిమాలో నాని మాస్ లుక్ లో సందడి చేయనున్నారు.
ఈ సినిమాలో నాని సరసన నటి కీర్తి సురేష్ మరోసారి జతకట్టారు.