సంచలనంగా మారిన చిన్నారుల తారుమారు పంచాయితీ చివరకు కర్నూలు పోలీస్ స్టేషన్ కు చేరింది.ఈ నేపథ్యంలో వైద్యులు, బాధితులతో చర్చలు చేస్తున్నారు పోలీసులు.
సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.అయితే రమేశ్ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కాన్పు కోసం వస్తే డెలివరీ తర్వాత పురిట్లోనే తమ చిన్నారులను డాక్టర్లు మార్చేశారని ఆరోపిస్తున్నారు.మొదట బాబు పుట్టాడని మగ పిల్లాడిని ఇచ్చారని, గంట తర్వాత ఆడపిల్ల అంటూ ఆస్పత్రి సిబ్బంది బిడ్డను మార్చేశారని వెల్లడించారు.
మగ బిడ్డైనా, ఆడ బిడ్డైనా తమ బిడ్డే తమకు కావాలని బాధితులు వాపోతున్నారు.ఈ క్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రమేశ్ ఆస్పత్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.