జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ వ్యాధి సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.ఇలా ఇదివరకే ఈయన ఆరోగ్యం క్షీణించడంతో పలువురు సహాయ సహకారాలతో ఈయనకు సర్జరీ నిర్వహించారు.
అయితే ఈ అనారోగ్య సమస్య నుంచి కోలుకున్న పంచ్ ప్రసాద్ యధావిధిగా జబర్దస్త్ కార్యక్రమంలో తన అనారోగ్య సమస్యపై తానే సెటైర్లు వేసుకుంటూ అందరిని నవ్వించేవారు.అయితే తాజాగా నేను ఆరోగ్య పరిస్థితి మరోసారి విషమం అయినా సంగతి తెలిసిందే.
ఈ విధంగా పంచ్ ప్రసాద్ అనారోగ్య సమస్యతో బాధపడుతున్న తరుణంలో గతంలో ఆయన తన భార్య గురించి ఓ ఇంటర్వ్యూ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.తనది లవ్ మ్యారేజ్ అని ప్రసాద్ వెల్లడించారు.
ఈయన నిశ్చితార్థం జరుపుకున్న తర్వాత కిడ్నీ సమస్య బయటపడింది.ఈ విషయం తెలిసే నాతో సహా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ పెళ్లి నీకు క్యాన్సల్ చేసుకోవాలని తన భార్యకు చెప్పినా ఆమె మాత్రం వినకుండా నాతో ఒక్కరోజు బతికినా చాలు అంటూ అందరిని ఒప్పించి పెళ్లి చేసుకుందని తెలిపారు.

పెళ్లి తర్వాత మణికొండలో అవినాష్ వాళ్ళ ఇంటి పై పోషన్లో ఉండేవాళ్ళం అయితే ఒకానొక సమయంలో నాకు ఊపిరి ఆడుక ముక్కు నుంచి రక్తం ధారగా కారుతుంది అయితే ఈ విషయం నా భార్యకు చెబితే ఆమె ఎక్కడ కంగారు పడుతుందోనని, అప్పుడు తాను గర్భవతి అని చెప్పకుండా ఉన్నాను అయితే గెటప్ శీను భార్య తనకు 50 వేలు ఇచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేయించారని తెలిపారు.ఈ విధంగా కిడ్నీ సమస్యతో బాధపడుతూ విపరీతమైన డబ్బు ఖర్చు కావడమే కాకుండా భరించలేని నొప్పులు రావడంతో ఒకానొక సమయంలో చనిపోదామని భావించాను.ఆ సమయంలో తన భార్య తనకు కిడ్ని దానం చేయడానికి ముందుకు వచ్చిందని ప్రసాద్ తెలిపారు.ఈ విధంగా తనకు సమస్య ఉందని తెలిసినా తనని పెళ్లి చేసుకుందని తెలియడంతో ఎంతోమంది ఆమె నిజంగానే గ్రేట్ ఇది నిజమైన ప్రేమ అంటూ కామెంట్లు చేస్తున్నారు.