తెలంగాణ కాంగ్రెస్ రైతు సమస్యలపై పోరాడేందుకు సిద్ధమైంది.ఈ మేరకు రేపటి నుంచి పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
రేపటి నుంచి డిసెంబర్ 5వ తేదీ వరకు విడతల వారీగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.ఈ మేరకు సీఎస్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం ఇవ్వనున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 24న మండల స్థాయిలో, 30న నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలు చేయనున్నారు.అదేవిధంగా డిసెంబర్ 5న జిల్లా కేంద్రాల్లో కలెక్టరేట్ల వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నారని తెలుస్తోంది.