చిత్ర పరిశ్రమలో నటిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో పూజా హెగ్డే ఒకరు.అయితే 2022వ సంవత్సరంలో ఈమె భారీ బడ్జెట్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలన్నీ కూడా పూజా హెగ్డేను తీవ్ర నిరాశకు గురి చేశాయని చెప్పాలి.ఈ విధంగా వరుస సినిమాలు ప్లాప్ అయినప్పటికీ అమ్మడి క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.
ఇలా భారీ బడ్జెట్ సినిమాలు డిజాస్టర్ కావడంతో అవకాశాలు తగ్గుతాయని అందరూ భావించారు.
ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు వెంటాడిన పూజా హెగ్డే మాత్రం ప్రస్తుతం నాలుగైదు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు.
తెలుగు సినిమాలతో పాటు హిందీ సినిమాలతో కూడా పూజా హెగ్డే ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి పూజా హెగ్డే పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఒక సెలబ్రిటీ జీవితం ఎలా ఉంటుందో మనకు తెలిసిందే.వారు బయటకు వస్తే అభిమానులు వారిని చుట్టుముట్టి విసిగించినప్పటికీ వాళ్లు మాత్రం నవ్వుతూ ఎంతో సహనం ప్రదర్శిస్తారు.ఈ క్రమంలోని ఈ విషయం గురించి పూజా హెగ్డే మాట్లాడుతూ తాము ఒకసారి ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే నటించాల్సి వస్తుందని తెలిపారు.
బయటకు అడుగుపెట్టగానే ప్రేక్షకుల అభిప్రాయాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉంటుంది.సెలబ్రిటీల లైఫ్ లో ఇలాంటివి తప్పువు అందుకే నాకు నా ఇంట్లో ఉన్నంత స్వేచ్ఛ మరి ఎక్కడ ఉండదు.
ఇంట్లో నేను నాలా ఉంటాను.అందుకే బయట నుంచి ఇంటికి వచ్చేటప్పటికి నా వృత్తిపరమైన విషయాలన్నింటిని బయటే వదిలేసి ఇంటిలో హాయిగా, స్వేచ్ఛగా ఉంటానని ఈ సందర్భంగా ఈమే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.