నిర్మల్ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది.పొన్ మండలం గంజాల్ టోల్ ప్లాజా వద్ద ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పూజా ట్రావెల్స్ కు చెందిన బస్సులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు భారీగా ఎగసి పడ్డాయి.వెంటనే అప్రమత్తమైన టోల్ ప్లాజా సిబ్బంది ప్రయాణికులను కాపాడారు.
కాగా ప్రమాద సమయంలో బస్సులో 29 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం.నాగపూర్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ప్రమాదం జరిగింది.