పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతిలో నాలుగైదు పాన్ ఇండియా ప్రాజెక్టులు ఉన్నాయి.బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్ సినిమాలు దారుణంగా విఫలం అయ్యాయి.
ఈ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ ను సైతం మెప్పించలేక పోయాయి.దీంతో ఫ్యాన్స్ ఆశలన్నీ ఆదిపురుష్ సినిమా మీదనే పెట్టుకున్నారు.
కానీ వీరి ఆశలు దారుణంగా విఫలం అయ్యాయి.కొత్త ఏడాది లోనే సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని కొద్దిగా సంతోషంగా ఉన్నారు.
అయితే వీరి సంతోషం మీద నీళ్లు చల్లారు ఆదిపురుష్ మేకర్స్.ఎందుకంటే ఈ సినిమా ముందు అనుకున్నట్టు సంక్రాంతి కానుకగా రావడం లేదని చెప్పడంతో పూర్తిగా నిరాశ చెందారు.
సంక్రాంతి కి వాయిదా వేసిన ఈ సినిమా జూన్ 16, 2023 కి రిలీజ్ చేయనున్నట్టు ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ తెలిపాడు.
అయితే ఈ సినిమా వాయిదా పడడంతో రెండు సినిమాలపై భారీ ఎఫెక్ట్ పడనుంది అని ప్రచారం జరుగుతుంది.
ఈ మూవీ వాయిదా కారణంగా అటు ప్రభాస్ సలార్ తో పాటు.ఇటు ఎన్టీఆర్ ప్రాజెక్ట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు.
ప్రభాస్ సలార్ సినిమా ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించిన విషయం తెలిసిందే.వచ్చే ఏడాది సెప్టెంబర్ 28న ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్టు తెలిపడమే కాకుండా అందుకు సన్నాహాలు కూడా చేస్తున్నారు.
ప్రశాంత్ నీల్ దానికి తగ్గట్టు షూట్ ప్లాన్ చేసుకుని పక్కాగా ఆ సమయానికి పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యారు.ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ నెక్స్ట్ సినిమాను ఎన్టీఆర్ తో చేయబోతున్నాడు.ఎన్టీఆర్ 31వ సినిమాను సలార్ పూర్తి అవ్వగానే వెంటనే స్టార్ట్ చెయ్యాలని ప్లాన్ చేసుకున్నాడు.అయితే ఆదిపురుష్ రిలీజ్ డేట్ కారణంగా సలార్ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశం ఉంది.
అలా జరిగితే సలార్ మాత్రమే కాకుండా ఆ తర్వాత ప్రశాంత్ నీల్ చేయబోతే ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై కూడా ఎఫెక్ట్ పడుతుంది.ఆదిపురుష్ కారణంగా రెండు ప్రాజెక్టులు ఆలస్యం కాబోతున్నాయి.
మరి ప్రశాంత్ నీల్ ఎలా ఈ సమస్యను అధిగమిస్తాడో చూడాలి.