చిత్తూరు జిల్లాలో ఏనుగుల గుంపు సంచారం కలకలం సృష్టిస్తుంది.రామకుప్పం మండలం పీఎం తండాలో గజరాజులు స్వైర విహారం చేశాయి.
పంట పొలాలను నాశనం చేశాయి.దీంతో రైతులు, గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికి ఎన్నోసార్లు అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చామని చెప్పారు.కానీ ఫారెస్ట్ అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి తమను, తమ పంట పొలాలను ఏనుగుల బారి నుంచి కాపాడాలని కోరుతున్నారు.అదేవిధంగా నష్టపోయిన పంట పొలాలకు పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.