ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ టెస్లా అధినేత ఎలన్ మాస్క్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాలు అందరికి తెలిసిందే.ట్విట్టర్ లో పనిచేస్తున్న ఉద్యోగులలో దాదాపు 50 శాతం మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్టుగా మాస్క్ తీసుకున్న నిర్ణయం సంచలనం సృష్టిస్తోంది.
ఈ ఘటన ట్విట్టర్లో పనిచేస్తున్న ఉద్యోగులలో ఆందోళన రేకెత్తించింది.ఎవరి ఉద్యోగాలు ఉంటాయో ఊడిపోతాయో అనే సందిగ్నంలో ఉన్నారు ఉద్యోగులు.
అయితే ప్రస్తుత పరిణామాలు మాత్రం హెచ్ -1 బి విసాదారుల్లో మాత్రం టెన్షన్ పుట్టిస్తున్నాయి.వివరాలలోకి వెళ్తే.
ట్విట్టర్ పగ్గాలు మాస్క్ చేతికి వచ్చిన తర్వాత ఎంతో మందిని ఉద్యోగాల్లోంచి తొలగించేశారు.వీరిలో అధికశాతం మంది విదేశీయులు ఉండగా వీరిలో హెచ్ -1 బి, ఎల్ -1 ,ఓ-1 వర్క్ విశాలపై సంస్థలో పనిచేసే వారే ఎక్కువగా ఉన్నారు.
అయితే ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోవడంతో ఈ విదేశీయులు అందరూ చిక్కుల్లో పడిపోయారనే చెప్పాలి.అమెరికా ప్రఖ్యాత పత్రిక ఫోర్బ్స్ తెలిపిన వివరాల ప్రకారం.ట్విట్టర్ లో పనిచేస్తున్న ఉద్యోగులలో మొత్తం 670 మంది హెచ్ 1బి వీసా దారులే ఉన్నారట.అయితే ఈ సంఖ్య మొత్తం ఉద్యోగులలలో 7 శాతం ఉండగా వీరిలో ఎంత మంది ఉద్యోగాలు కోల్పోయారో ప్రకటించలేదు ట్విట్టర్.ఇదిలాఉంటే
అమెరికాలో వీసా నిబంధనలు ప్రకారం హెచ్ -1బి వీసా దారులు ఉద్యోగాలు గనుకా కోల్పోతే వారికి 60 రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది, ఈ క్రమంలో వారు మరో సంస్థలో ఉద్యోగంలో చేరి వీసా కోసం దరఖాస్తు పెట్టుకోవాలి.ఈ గ్రేస్ పీరియడ్ కూడా వీసా దారుడికి ప్రస్తుత వీసా కాలపరిమితి ఆధారంగా నిర్ణయించబడుతుంది.కాగా ప్రఖ్యాత కంపెనీ నుంచి ఒక్కసారిగా ఉద్యోగాలు కోల్పోయిన ఇలాంటి వారందరికీ వీసా స్పాన్సర్లు తొందరగా దొరికే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.అయితే కంపెనీలో అంతర్గత బదిలీల్లో భాగంగా ఎల్ -1 వీసాపై అమెరికా వచ్చిన వారికి మాత్రం ఇబ్బందులు తప్పవని ఒకవేళ ఇలాంటి వారు తొలగించిన ఉద్యోగులలో ఉంటే తప్పనిసరిగా వారి సొంత దేశానికి వెళ్లాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.