టాలీవుడ్ బెస్ట్ జోడీలలో మహేష్ బాబు నమ్రత జోడీ కూడా ఒకటనే సంగతి తెలిసిందే.ఈ జోడీకి సోషల్ మీడియాలో కూడా ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండగా మహేష్ నమ్రత ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి తెలిసిందే.
మహేష్ బాబులో ఎన్నో క్వాలిటీలను ఇష్టపడే నమ్రత ఒక క్వాలిటీని మాత్రం సమాచారం.పైకి కూల్ గా కనిపించే మహేష్ బాబుకు కొన్ని సందర్భాల్లో కోపం ఎక్కువగా వస్తుందని బోగట్టా.
కోపం మరీ పెరిగితే అవతలి వ్యక్తిపై మహేష్ బాబు టంగ్ స్లిప్ అవుతారని సమాచారం.ఈ కారణం వల్ల పలు సందర్భాల్లో మహేష్ బాబు నమ్రతల మధ్య చిన్నచిన్న గొడవలు జరిగాయని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం.
అయితే మహేష్ బాబుకు అరుదుగానే కోపం వస్తుందని మహేష్ కు కోపం వస్తే కంట్రోల్ చేయడం ఆయన కుటుంబ సభ్యులకు కూడా చేతకాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ విషయంలో మహేష్ బాబు మారాలని నమ్రత పలు సందర్భాల్లో సూచనలు చేసినా మహేష్ బాబు మాత్రం ఈ విషయంలో మారలేదని తెలుస్తోంది.
మరోవైపు మహేష్ బాబు కుటుంబానికి ఎంతగానో ప్రాధాన్యత ఇస్తారు.మహేష్ తన పిల్లలపై గాసిప్స్ రాస్తే మాత్రం సీరియస్ గా రియాక్ట్ అవుతారని సమాచారం.
మరోవైపు మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ షూట్ శరవేగంగా జరుగుతోంది.
మూడేళ్ల తర్వాత మహేష్ పూజా హెగ్డే కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ కాగా ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి.మహేష్ పూజాహెగ్డే కాంబో మూవీ మహర్షి సినిమాను మించిన సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.ఈ సినిమా 2023 సమ్మర్ లో రిలీజ్ కానుండగా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటుందో చూడాలి.
ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కావాల్సి ఉంది.