Actress Alia Bhatt Bollywood: కూతురికి జన్మనిచ్చిన బాలీవుడ్ నటి అలియా భట్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రణబీర్ కపూర్ ఆలియా భట్ గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమలో ఉండి ఈ ఏడాది ఏప్రిల్ నెలలో వివాహ బంధంతో ఒకటైన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ దంపతులు పెళ్లి చేసుకున్న రెండు నెలలకే అలియా భట్ గర్భవతి అని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

 Bollywood Actress Alia Bhatt Gave Birth To A Daughter, Bollywood , Actress Alia-TeluguStop.com

ఇలా పెళ్లి జరిగిన రెండు నెలలకే ఈ దంపతులు తల్లిదండ్రులు కాబోతున్నారని తెలియడంతో పెద్ద ఎత్తున సినీ సెలబ్రిటీలు అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇలా అలియా భట్ ప్రెగ్నెంట్ అయినప్పటికీ ఈమె ఏ మాత్రం వెనకడుగు వేయకుండా తాను కమిట్ అయిన సినిమాలన్నింటిని కూడా పూర్తి చేశారు.

ఇకపోతే రణబీర్ కపూర్ ఆలియా భట్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఈమె బేబీ బంప్ తోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా తరచూ ఈమె బేబీ బంప్ ఫోటోషూట్లను చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకునేవారు.

Telugu Bollywood, Gave, Ranbir Kapoor-Movie

ఇకపోతే తాజాగా రణబీర్ కపూర్ ఆలియా భట్ దంపతులు పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు తెలుస్తోంది.నేడు ఉదయం అలియా భట్ ముంబైలోని రిలయన్స్ హాస్పిటల్ లో అడ్మిట్ కాగా కొద్ది క్షణాల క్రితం ఈమె ఆడబిడ్డకు జన్మనిచ్చినట్టు సోషల్ మీడియా వేదికగా ఈ దంపతులు తెలియజేశారు.ఈ క్రమంలోనే రణబీర్ ఆలియా భట్ ఇద్దరు కూతురికి జన్మనిచ్చారని తెలియడంతో అభిమానుల సైతం సంతోషం వ్యక్తం చేస్తూ ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube