కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ దళపతి మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.ఇటీవలే బీస్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించలేక పోయింది.
ఈ సినిమా తమిళ్ లో విజయ్ క్రేజ్ కారణంగా బాగానే కలెక్షన్స్ వచ్చిన మిగతా చోట్ల మాత్రం ప్లాప్ అయ్యింది.
దీంతో నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.
తమిళ్ లో తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చుకున్న విజయ్ ఇప్పుడు తెలుగులో కూడా మెప్పించడానికి టాలీవుడ్ డైరెక్టర్ తో రాబోతున్నాడు.టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ తన 66వ సినిమాను చేస్తున్నాడు.
తమిళ్ లో ‘వరిసు’ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ సినిమాపై ఇప్పటికే అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.
దిల్ రాజు భారీ స్థాయిలో శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ బ్యానర్ పై పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుండి నిన్న సాయంత్రం ఫస్ట్ సింగిల్ వచ్చింది.ఇది బాగా ఆకట్టు కుంటుంది.రంజితమే అనే పల్లవితో సాగుతున్న ఈ సినిమా ఫస్ట్ సింగిల్ ప్రోమో యూట్యూబ్ లో రిలీజ్ అయ్యింది.
ఈ సాంగ్ ను స్వయంగా విజయ్ ఆలపించడంతో ఈ సాంగ్ ఆయన ఫ్యాన్స్ కు మరింత ఆకట్టుకుంటుంది.ఈ సాంగ్ ప్రోమో మాస్ బీట్ తో ఆకట్టుకునేలా థమన్ ఈ సాంగ్ ను మలిచాడు.మరి ఈ సినిమా ఫుల్ సాంగ్ నవంబర్ 5న రిలీజ్ అవ్వనుంది.
ఇక ఈ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారు.