పిల్లులు చాలా తెలివైనవి.ఇవి కుక్కలలాగా ఉండకుండా తమకు నచ్చినట్లు ప్రవర్తిస్తాయి.
పెంపుడు పిల్లులు రోజంతా పడుకుంటూ బోర్ కొట్టినప్పుడు ఆడుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తాయి.కాగా తాజాగా ఒక పిల్లి మెట్లపై కట్టిన ఒక జారుడు బల్లపై జారుతూ చిన్నపిల్లల వల్లే ఆడుకుంది.
ప్రముఖ ట్విట్టర్ పేజీ @buitengebieden ఈ క్యాట్ వీడియోను షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 20 లక్షల వ్యూస్ వచ్చాయి.
లక్షకు పైగా లైక్స్ వచ్చాయి.క్యాట్ స్లయిడ్ అని ఈ వీడియోకి ఆ ట్విట్టర్ పేజీ ఒక క్యాప్షన్ కూడా జోడించింది.
వైరల్ అవుతున్న 12 సెకండ్ల నిడివి గల వీడియోలో ఒక నల్ల పిల్లి ఏటవాలుగా ఉన్న ఒక కట్టడంపై జారుతూ కనిపించింది.ఒక్కసారి జారిన తర్వాత ఆ పిల్లి మళ్ళీ కట్టడంపైకి ఎక్కి మళ్లీ మనుషుల వలె జారుకుంటూ కిందకు వచ్చింది.
ఈ వీడియో చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు.కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా ఇలా చిన్న పిల్లల ఆడుకుంటాయని ఇప్పుడే తమకు తెలిసిందని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు.
చాలామంది ఈ పోస్ట్ కింద రకరకాల యానిమల్ వీడియోస్ షేర్ చేస్తున్నారు.వాటిలో ఒక వీడియోలో మేకలు కూడా మెట్ల నిర్మాణం పక్కనే జారుడు బల్లలాగా ఉన్న కట్టడం పైకి ఎక్కి జారుతూ ఆడుకున్నాయి.మరి కొన్ని వీడియోలలో కుక్కలు ఇలా సరదాగా ఆడుకుంటూ కనిపించాలి.ప్రస్తుతం వైరల్ అవుతున్న క్యాట్ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.